Madhya Pradesh: ఒకే కుటుంబంలోని అయిదుగురు ఆత్మహత్య.. విషం తాగి..

Madhya Pradesh (tv5news.in)
Madhya Pradesh: ఈమధ్య ఏ సమస్య వచ్చినా ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటున్నారు చాలామంది. ముఖ్యంగా అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబంలోని పెద్దలు చనిపోవడం మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ దానికి భిన్నంగా మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా తీసుకుపోవాలి అనుకున్నాడు. అందుకే అందరు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని పిపలానీ ప్రాంతానికి చెందిన సంజీవ్ జోషి ఎక్కువగా అప్పులు చేశాడు. ఇటీవల అప్పులు ఇచ్చిన వారి నుండి తనకు వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు తాళలేక సంజీవ్.. తన తల్లి, భార్య, కూతుళ్లతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి ఆత్మహత్యకు కారణమోవరో అందరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో కుటుంబం మొత్తం విషం తాగిన వీడియోను వాట్సాప్‌కు పంపించాడు.
సంజీవ్ కూతుళ్లు గ్రీష్మ, పూర్వి కూడా వాట్సాప్‌లో సూసైడ్ వీడియోను పంపించారు. అంతే కాక అందరు సూసైడ్ నోట్ కూడా రాశారు. దానిని వారి ఇంటి గోడలకు అతికించారు. ముఖ్యంగా గ్రీష్మ, పూర్వి రాసిన సూసైడ్ నోట్స్ అందరినీ కదిలించాయి. సైంటిస్ట్ కావాలనుకున్నానని ఒకరు, ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నానని మరొకరు రాసి ఆత్మహత్య చేసుకున్నారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబాన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ ఒకరి తర్వాత ఒకరు ఈ అయిదుగురు మృతి చెందారు. సూసైడ్ నోట్, వాట్సాప్ వీడియోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వేధింపులకు పాల్పడిన నలుగురు మహిళలను అరెస్ట్ చేసారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకేసారి ఒకే కుటుంబంలోని అయిదుగురు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com