Rajasthan Crime: షర్ట్ గురించి భార్యభర్తల మధ్య గొడవ.. చివరికి భార్య..

rajasthan (tv5news.in)
Rajasthan Crime: ఒక్కొక్కసారి చిన్న చిన్న వివాదాలే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తాయి. చిన్న గొడవగా మొదలయ్యి మాటామాటా పెరిగి హత్యలు, ఆత్మహత్యలు వారికి దారితీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా భార్యభర్తల మధ్య ఇలాంటి వివాదాలను తరచూ చూస్తూనే ఉన్నాం. భర్త తనకు నచ్చినట్టుగా షర్ట్ కుట్టించలేదని ఆత్మహత్య చేసుకుందో భార్య. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన అంజలి సుమన్‌కు.. రాజస్తాన్‌కు చెందిన శుభం అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అప్పటినుండి వారి మధ్య పెద్దగా గొడవలు ఏమీ జరగలేదు. కానీ ఇటీవల వారిద్దరూ ఒక షర్ట్ విషయంలో గొడవపడ్డారు. శుభం తనకు నచ్చినట్టుగా షర్ట్ కుట్టించలేదని అంజలి తనతో గొడవపడింది. చిన్న గొడవ లాగా ప్రారంభమయినా కూడా ఇది పెద్ద పరిణామానికే దారితీసింది.
అంజలితో గొడవపడి విసిగిపోయిన శుభం ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. అంజలి తనకు పలుమార్లు కాల్ చేస్తే ఇంటికి వచ్చాక మాట్లాడదామని ఫోన్ పెట్టేసాడు. అంతే.. అరగంట తర్వాత అంజలి ఉరేసుకుని ఆత్యహత్య చేసుకుందని శుభంకు ఫోన్ వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యలు అక్కడికి చేరుకున్నారు. ఇలాంటివి చూసినప్పుడే ఏ గొడవ ఎలాంటి పరిణామానికి దారితీస్తుందో చెప్పలేకపోతున్నాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com