Amberpet: అంబర్‌పేట్‌లో భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య..

Amberpet: అంబర్‌పేట్‌లో భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య..
X
Amberpet: భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదని ఆత్మహత్య చేసుకుందో ఇల్లాలు.

Hyderabad: భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదని ఆత్మహత్య చేసుకుందో ఇల్లాలు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో జరిగింది. దంపతులు శ్రీనివాసులు, విజయలక్ష్మి.. గోల్నాక తిరుమలనగర్‌లో నివాసముంటున్నారు. టైలర్‌ అయిన శ్రీనివాసులు‌.. స్కూటర్‌ మీద చీరలు కూడా అమ్ముతుంటారు.

శనివారం ఆయన భార్య కోసం ఓ బ్లౌజ్‌ కుట్టగా.. అది నచ్చలేదని భార్య గొడవ పడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. స్కూల్‌ నుంచి వచ్చిన పిల్లలు తలుపు తట్టగా ఎంతకూ ఆమె తలుపు తీయకపోయేసరికి.. ఆత్మహత్యకు పాల్పడిన విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Next Story