Siddipet: ఇష్టం లేని పెళ్లి చేశారని భర్తను చంపిన భార్య.. ప్రియుడితో కలిసి..

Siddipet: సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారని.. భర్తను ఓ భార్య కడతేర్చింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. తోగుట మండలం గుడికందల గ్రామానికి చెందిన శ్యామల, చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్‌లకు మార్చి 23న వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తితో శ్యామలకు ప్రేమ వ్యవహారం ఉంది.
ఈ నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించునేందుకు ఒకసారి విష ప్రయోగం చేయగా.. అది విఫలమైంది. దీంతో ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి మరోసారి హత్యకు కుట్ర పన్నింది. ఏప్రిల్ 28న అనంత సాగర్ క్షేత్రంలో మొక్కు ఉందని.. భర్తను నమ్మించి తీసుకెళ్లిన శ్యామల.. శివ, అతని స్నేహితులతో కలిసి చంపింది. అనంతరం గుండెపోటతో భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. అయితే పోస్టుమార్టంలో గొంతు నులిమి చంపినట్లు వెల్లడికావడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com