Crime News: దారుణం.. ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లను పెంచుకోవాలని భార్య న్యూడ్ ఫోటోలు..

Crime News: దారుణం.. ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లను పెంచుకోవాలని భార్య న్యూడ్ ఫోటోలు..
Crime News: ఛీఛీ.. మనుషులేంటి ఇంత దారుణంగా తయారవుతున్నారు. జంతువులకన్నా హీనంగా తయారవుతున్నారు.

Crime News: ఛీఛీ.. మనుషులేంటి ఇంత దారుణంగా తయారవుతున్నారు. జంతువులకన్నా హీనంగా తయారవుతున్నారు.భార్య మాన ప్రాణాలను కాపాడాల్సిన భర్త దుర్మార్గంగా ప్రవర్తించాడు.. భార్య స్నానం చేస్తున్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. వ్యూయర్స్ పెంచుకునే ప్రయత్నంలో భాగమే ఈ చెత్త తెలివితేటలకు కారణమని భార్య వాపోతోంది. సోషల్ మీడియాకు అడిక్ట్ అయి ఇలాంటి పనులు చేస్తున్నాడని భర్తమీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య స్నానం చేస్తున్న చిత్రాలను తన ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేసి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లోని ఫోటోలను తొలగించాలని మహిళ తన భర్తను కోరింది, కానీ అతను అందుకు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అకౌంట్ డిలీట్ అయింది.

ఫిరోజాబాద్ జిల్లాలోని జస్రానా పోలీసులు అతడిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఉంటూ సర్కస్‌లో పనిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియో కాల్స్ ద్వారా తరచూ మాట్లాడుతుండేవాడని అతని భార్య పేర్కొంది. తాను స్నానం చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడని ఆమె ఆరోపించింది.

భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) రణవిజయ్ సింగ్ తెలిపారు. దంపతులు తమ వాంగ్మూలాలను నమోదు చేసుకున్న తర్వాత కేసుకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని సింగ్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story