క్రైమ్

Rangareddy District: మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన భార్య..

Rangareddy District: మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌ హ్యాండెడ్‌ పట్టించింది.

Rangareddy District: మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన భార్య..
X

Rangareddy District: మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌ హ్యాండెడ్‌ పట్టించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ పరిధిలోని శివ నారాయణపురంలో చోటు చేసుకుంది. పద్దెనిమిదేళ్ల క్రితం వేణుకు.. కల్పనకు వివాహమైంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు ముదరడంతో మూడేళ్ల క్రితం భార్య కల్పన.. పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ భర్త వేణు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏకంగా ఇంట్లోనే కాపురం పెట్టేశాడు. దీంతో విషయం తెలుసుకున్న కల్పన.. మహిళ సంఘంతో కలిసి వేణు ఇంటికి వెళ్లింది. మరో మహిళతో ఉన్న వేణును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టించింది. ఈ క్రమంలోనే భార్య కల్పనపై వేణు దాడి చేశాడు. ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో గాయాలయ్యాయి. న్యాయం కోసం వేణు ఇంటి ముందు పిల్లలతోపాటు కల్పన ఆందోళనకు దిగింది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES