Delhi: బాయ్‌ఫ్రెండ్ వల్ల 14 సార్లు అబార్షన్.. తట్టుకోలేకే యువతి ఆత్మహత్య..

Delhi: బాయ్‌ఫ్రెండ్ వల్ల 14 సార్లు అబార్షన్.. తట్టుకోలేకే యువతి ఆత్మహత్య..
Delhi: ఈ ఎనిమిదేళ్ల సహజీవనంలో యువతికి 14 సార్లు అబార్షన్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

Delhi: ప్రేమ అన్నాడు. పెళ్లి అన్నాడు. మాయమాటలు చెప్పి యువతిని లొంగదీసుకున్నాడు. దాని వల్ల యువతి గర్భం దాల్చింది. యువతికి ఇష్టం లేకపోయినా.. బలవంతంగా 14 సార్లు అబార్షన్ చేయించాడు. దీంతో తను మానసికంగా కృంగిపోయింది. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ ఘటన ఢిల్లీలోని జైత్‌పూర్‌లో జులై 5న జరిగింది. ఈ కేసు విషయంలో విచారణ చేపట్టిన పోలీసులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఆత్మహత్య చేసుకున్న 33 ఏళ్ల యువతి చాలాకాలం క్రితమే వివాహం జరిగింది. కానీ భర్తతో మనస్పర్థలు రావడంతో తన నుండి విడిపోయి గౌతమ్ కుమార్ సింగ్ అనే వ్యక్తితో 8 ఏళ్లుగా సహజీవనం చేస్తుంది. అతడు తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరికంగా దగ్గరయ్యాడని, ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే మాట మార్చేస్తున్నాడని, అందుకే తనకు ఆత్మహత్య తప్పితే వేరే మార్గం లేదని సూసైడ్ నోట్ రాసింది యువతి.

ఈ ఎనిమిదేళ్ల సహజీవనంలో యువతికి 14 సార్లు అబార్షన్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీని వల్ల తను మరింత మానసికంగా కృంగిపోయిందని తెలిపారు. అయితే ఆ యువతికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని తన సోదరుడు వెళ్లడించాడు. ప్రస్తుతం నిందితుడు గౌతమ్ పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story