వివాహితని నిర్బంధించి తొమ్మిది రోజుల పాటు అత్యాచారం.. నిందితుల్లో కానిస్టేబుల్..!

వివాహితని నిర్బంధించి తొమ్మిది రోజుల పాటు అత్యాచారం.. నిందితుల్లో కానిస్టేబుల్..!
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ మహిళల పైన అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడో చోట ఎవరో ఒకరు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ మహిళల పైన అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడో చోట ఎవరో ఒకరు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. తాజాగా ఓ వివాహితని గదిలో నిర్బంధించి కొందరు దుండగులు తొమ్మిది రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. సోహ్నా గ్రామానికి చెందిన వివాహిత(20) గత నెల 30న పరిచయం ఉన్న వ్యక్తితోనే మాట్లాడుతుండగా అతని ఇద్దరి స్నేహితులు వచ్చి ఆమెను అపహరించారు. మరో వ్యక్తితో కలిసి నలుగురు దుండగులు ఆమెను ఫరిదాబాద్‌లో ఓ గదిలో నిర్భందించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తొమ్మిది రోజుల అనంతరం భాదితురాలు వారి నుంచి తప్పించుకొని భల్లబ్‌గఢ్‌ బస్‌స్టేషన్‌ చేరుకుంది.

అక్కడి నుంచి ఆమె తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేయగా వారొచ్చి ఆమెను తీసుకెళ్ళారు. ఈ ఘటన పైన తాజాగా ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. నిందితుల్లో తనకి ఒకరు తెలుసనని, అతను పోలీస్‌ కానిస్టేబుల్‌ అని వెల్లడించింది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

బాధితురలు పొలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు సహకరించినందుకు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపైన కూడా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story