మహిళ కానిస్టేబుల్ పై సాముహిక అత్యాచారం.. ఆపై...!

మహిళ కానిస్టేబుల్ పై సాముహిక అత్యాచారం.. ఆపై...!
ఓ మహిళ కానిస్టేబుల్ పై ఓ ముగ్గురు దుండగులు సాముహిక అత్యాచారం చేశారు. నెలరోజుల క్రితం జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోనీ నీముచ్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఓ మహిళ కానిస్టేబుల్ పై ఓ ముగ్గురు దుండగులు సాముహిక అత్యాచారం చేశారు. నెలరోజుల క్రితం జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోనీ నీముచ్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు ఈ నెల 13న పోలీసులకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలకి నిందితుడు ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. దీనితో ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది.

ఈ క్రమంలో తన సోదరుడి పుట్టినరోజుకు రావాలని నిందితుడు బాధితురాలని ఆహ్వానించాడు. ఆమె కూడా అతన్ని నమ్మి వెళ్ళింది. అక్కడ జరిగిన పార్టీలో బాధితురాలిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా దీనిని మొత్తం వీడియో తీశారని బాధితురాలు ఆరోపించింది. ప్రధాన నిందితుడి తల్లి తనను బెదిరించిందని, వారి బంధువు ఒకరు తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా డబ్బులు కూడా గుంజుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించింది.

కాగా ప్రస్తుతం ఇండోర్ జిల్లాలో పనిచేస్తున్న బాధితురాలు తొలుత నీముచ్‌లో పనిచేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story