క్రైమ్

Crime News: పార్టీకి పిలిచి మత్తు మందు ఇచ్చి.. యువతిపై ముగ్గురు యువకులు..

Crime News: బర్త్ డే పార్టీ తర్వాత యువతికి స్పైక్ డ్రింక్ ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు.

Crime News: పార్టీకి పిలిచి మత్తు మందు ఇచ్చి.. యువతిపై ముగ్గురు యువకులు..
X

Crime News: ఆమె ఆదివారం జరిగిన పార్టీకి హాజరైంది. పార్టీలో ఎవరో మత్తుమందు కలిపిన పానీయం అందించారు. పార్టీకి వచ్చిన ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. ఘజియాబాద్ జిల్లా మోడీ నగర్ పట్టణంలో బర్త్ డే పార్టీ తర్వాత 19 ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు.

ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి ఆదివారం పార్టీకి హాజరై స్నేహితులతో సరదాగా మాట్లాడుతోంది. గమనించిన ముగ్గురు యువకులు ఆమెతో మాటలు కలిపారు. పథకం ప్రకారం ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం అందిచారు. అది తాగి స్పృహ కోల్పోయింది ఆ యువతి.

ఆ తర్వాత ఓ వ్యక్తి ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి తన స్నేహితులను కూడా పిలిచి అత్యాచారం చేయబోయాడు.. కానీ ఆమె వారిని ప్రతిఘటించడంతో నిందితులు ఆమెను కొట్టి మరీ అత్యాచారం చేశారు.

జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. ప్రాణాలతో బయటపడిన యువతి ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులకు జరిగిన సంఘటనను వివరించింది. సోమవారం ఆమె తన తండ్రితో కలిసి మోడీ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

పోలీసులు యువతిని వైద్యపరీక్షలకు పంపగా, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Next Story

RELATED STORIES