రాపిడో బైక్ డ్రైవర్ ఘాతుకం.. ఆమెను గట్టిగా పట్టుకుని..

రాపిడో బైక్ డ్రైవర్ ఘాతుకం.. ఆమెను గట్టిగా పట్టుకుని..
ఏ టైమ్‌లో అయినా, ఎక్కడి వెళ్లాలన్నా రాపిడోలు, ఉబెర్‌లు, ఓలా వంటి సర్వీసులు ఉన్నాయని సంతోషించేలోపే ఈ సర్వీసుల ద్వారా కొన్ని ఘటనలు చోటు చేసుకోవడం మెట్రో నగర వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

ఏ టైమ్‌లో అయినా, ఎక్కడి వెళ్లాలన్నా రాపిడోలు, ఉబెర్‌లు, ఓలా వంటి సర్వీసులు ఉన్నాయని సంతోషించేలోపే ఈ సర్వీసుల ద్వారా కొన్ని ఘటనలు చోటు చేసుకోవడం మెట్రో నగర వాసులనుభయభ్రాంతులకు గురిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ యువతి రాపిడో డ్రైవర్ నుంచి తనను తాను కాపాడుకునేందుకు కదులుతున్న బైక్ నుంచి దూకేసింది. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి బాధితురాలు ఇందిరానగర్‌కు రాపిడో రైడ్‌ను బుక్ చేయగా, రాత్రి 11:10 గంటలకు డ్రైవర్ ఆమెను ఎక్కించుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బైకర్ OTPని తనిఖీ చేసే సాకుతో ఆమె ఫోన్ తీసుకున్నాడు. చెవి కమ్మలు తీసుకుని ఆమెను తాకుతూ లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. వెళ్లవలసిన లొకేషన్‌‌కు కాకుండా, ఎయిర్‌పోర్ట్ వైపు డ్రైవింగ్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె గట్టిగా డ్రైవర్‌ను వారించి బుక్ చేసిన లొకేషన్‌కు తీసుకెళ్లమని చెప్పినప్పటికీ విననట్లే మౌనంగా ఉంటూ మరింత స్పీడుగా బైకుని ముందుకు పోనిస్తున్నాడు. దీంతో భయపడిపోయిన మహిళ తనను తాను రక్షించుకోవడానికి కదులుతున్న మోటార్‌ బైక్‌పై నుంచి దూకేసింది. ఇది గమనించిన బీఎంఎస్ కళాశాల గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెకు సహాయం చేశారు. ఇది చూసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

మహిళకు కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. ఆమె హెల్మెట్ ధరించడంతో తలకు, ముఖానికి పెద్దగా గాయాలు కాకుండా తప్పించుకుంది. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు, స్నేహితులకు తెలియజేసింది. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై విచారణ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story