తన అఫైర్‌ను భర్తకు చెపుతాడనే భయంతో మహిళ తన మూడేళ్ల కుమారుడిని..

తన అఫైర్‌ను భర్తకు చెపుతాడనే భయంతో మహిళ తన మూడేళ్ల కుమారుడిని..
అమ్మ మారిపోతోంది. కని పెంచిన బిడ్డల మీద కనికరం లేకుండా పోతోంది.

అమ్మ మారిపోతోంది. కని పెంచిన బిడ్డల మీద కనికరం లేకుండా పోతోంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని బిడ్డల్ని చంపే తల్లులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ముక్కుపచ్చలారని మూడేళ్ల కొడుకుని చంపేసింది ఓ తల్లి. తన అఫైర్‌ను భర్తకు చెపుతాడనే భయంతో మహిళ తన మూడేళ్ల కుమారుడిని హత్య చేసింది. ఆమె తన నేరాన్ని ఒప్పుకుంది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక మహిళ తన పొరుగింటి వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఆ విషయం పసి మనసుకు అర్థం కాకపోయినా ఆమె భయపడింది. ఎక్కడ కొడుకు తన తండ్రికి చెబుతాడో అని భయపడింది. అంతే ఆడుకుంటున్న 3 ఏళ్ల కొడుకును టెర్రస్‌పై నుండి కిందకు విసిరేసింది. దాంతో పాపం పసివాడు ప్రాణాలు కోల్పోయాడు.

జ్యోతి రాథోడ్ అనే మహిళ తన సంబంధాన్ని పోలీసు కానిస్టేబుల్ అయిన తన భర్త ధ్యాన్ సింగ్‌కు చెబుతాడనే భయంతో తన కొడుకును హత్య చేసింది. తన కొడుకును చంపిన తర్వాత, జ్యోతికి అతని గురించి పీడకలలు రావడం ప్రారంభించడంతో భయపడిపోయింది. ఆమె తన నేరాన్ని తన భర్త ముందు ఒప్పుకుంది.

భార్య చెప్పిన మాటలను రికార్డు చేసి పోలీసులకు అందించాడు ధ్యాన్ సింగ్. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో జ్యోతికి తన పొరుగువాడైన ఉదయ్ ఇందౌలియాతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది.

ఏప్రిల్ 28న ధ్యాన్ సింగ్ తన ప్లాస్టిక్ దుకాణం ప్రారంభోత్సవాన్ని నిర్వహించినప్పుడు ఈ సంఘటన జరిగింది. అతను తన పొరుగువారి ఉదయ్ ఇందౌలియాతో సహా చాలా మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాడు. అందరూ బిజీగా ఉండగా, జ్యోతి మరియు ఉదయ్ టెర్రస్ మీద సన్నిహితంగా ఉన్నారు. జ్యోతి కొడుకు కూడా తన తల్లి కోసం డాబాపైకి వెళ్లాడు.

దీంతో భయపడిన జ్యోతి తన సంబంధాన్ని దాచేందుకు మూడేళ్ల కొడుకును టెర్రస్‌పై నుంచి తోసేసింది. పసివాడి తలకు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మరణించాడు.

బాలుడు ప్రమాదవశాత్తు టెర్రస్ పై నుంచి పడిపోయాడని మొదట్లో అందరూ అనుకున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత, జ్యోతికి తన కొడుకు గురించి పీడకలలు రావడం మొదలైంది. దీంతో ఆమె భయపడిపోయి చివరికి తానే తన బిడ్డను హత్య చేశానని భర్త ముందు నేరాన్ని ఒప్పుకుంది. దీని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి జ్యోతి మరియు ఆమె ప్రేమికుడు ఉదయ్ ఇందౌలియా ఇద్దరినీ అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story