నల్గొండ జిల్లాలో విషాదంగా మారిన ఒక భర్త..ఇద్దరు భార్యల కథ

నల్గొండ జిల్లాలో విషాదంగా మారిన ఒక భర్త..ఇద్దరు భార్యల కథ

నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక భర్త ఇద్దరు భార్యల కథ విషాదంగా మారింది. నల్గొండకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి.. మోత్కూర్ లో ఐసిడిఎస్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. 1999లో ప్రసన్న రాణి అనే మహిళను వివాహం చేసుకోగా.. ఆమెకు ప్రస్తుతం 20 ఏళ్ళ కొడుకు, 15 ఏళ్ళ కూతురు ఉంది. అయితే.. కుటుంబ, వ్యక్తిగత గొడవలతో.. మొదటి భార్య ప్రసన్న రాణి కి తెలియకుండా శాంతి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకోవడమే గాక.. ఆమెకు ఇద్దరు పిల్లలను కని.. ఏకంగా ఇల్లు నిర్మాణం చేస్తూ ఆస్తులు సైతం కొనుగోలు చేసినట్టు మొదటి భార్యకు తెలిసింది. దీంతో భర్తకు మొదటి భార్యకు మధ్య కుటుంబ తగాదాలు జరిగాయి.

భర్త ప్రదీప్ తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రసన్నరాణి ఆ విషయాన్ని మనసులో పెట్టుకుoది. పెళ్లి రోజు కావడంతో రెండో భార్య శాంతి ఇద్దరు కూతుర్లను మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఇంట్లో వారిద్దరిని ఉరేసి చంపి తాను సైతం ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంట్లో చిన్న చిన్న గొడవలు తప్పితే.. ఆస్తులకు సంబంధించిన వివాదాలు లేవని ప్రసన్నరాణి కొడుకు చెప్తున్నాడు. తమ నాన్నకు రెండో పెళ్లి జరిగిందన్న విషయం కొద్దిరోజుల కిందటే తన తల్లికి తెలిసి బయటికి చెప్పకుండా తనలోనేతాను కుమిలిపోయిందన్నాడు. ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడుతుందని కలలో కూడా ఊహించలేదని ప్రసన్నరాణి కొడుకు అంటున్నాడు.

తన భర్త ప్రదీప్.. మోసం చేయడమే గాక.. తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని.. ఇంకో పెళ్లి చేసుకుని కుటుంబాన్ని నడిపిస్తూ.. ఇల్లు నిర్మించడమే గాక ఆస్తులను కూడపెడుతున్నాడoటూ సూసైడ్ నోట్‌లో క్లుప్తంగా రాసింది మృతురాలు ప్రసన్న రాణి. ఈ సంఘటన నల్లగొండ పట్టణంలో స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళతో పాటు.. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను నల్లగొండ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story