సవతి పిల్లల్ని దారుణంగా హత్య చేసి.. తరువాత

సవతి పిల్లల్ని దారుణంగా హత్య చేసి.. తరువాత

ఓ మహిళ తన సవతి పిల్లల్ని దారుణంగా హత్య చేసి.. తాను ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన నల్గొండలో జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. పట్టణానికి చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో శాంతి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రదీప్‌కు, అతని మొదటి భార్య ప్రసన్నరాణికి ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయి. దీంతో మొదటి భార్య.. కుటుంబంపై కక్ష పెంచుకుంది. ఆమె ఇంటికి వెళ్లి ఇద్దరు పిల్లల్ని హత్య చేసి, తర్వాత అదే ఇంట్లో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ప్రసన్నరాణి.

రెండో పెళ్లి చేసుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భర్తపై ప్రసన్నరాణి కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు చెందిన ప్రదీప్‌.. 20 ఏళ్ల క్రితం నల్గొండకు వచ్చి స్థిరపడ్డాడు. దుప్పెల్లికి చెందిన ప్రసన్నరాణిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ తర్వాత ప్రదీప్‌ శాంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు.

మొదటి భార్య ప్రసన్నరాణి ప్రదీప్‌తో రాజీకి వచ్చింది. నెల రోజుల క్రితం అందరూ ఒక్కటై కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ, తన భర్త.. రెండో భార్యతోనే ఎక్కువగా గడుపుతుండడాన్ని ప్రసన్నరాణి సహించలేకపోయేది. భర్త, తన సవతి పిల్లలపై కసి పెంచుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లల ఉసురు తీసింది.

Tags

Read MoreRead Less
Next Story