క్యాబ్ డ్రైవర్ అసభ్య సంభాషణ.. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె

క్యాబ్ డ్రైవర్ అసభ్య సంభాషణ.. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె
అనుకోని పరిస్థితుల్లో అర్థరాత్రి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో క్యాబ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి.

అనుకోని పరిస్థితుల్లో అర్థరాత్రి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో క్యాబ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అంతా మంచిగా జరిగితే అనుకోవాల్సి ఏమీ ఉండదు. కానీ ఒంటరి మహిళలను చూస్తే చాలు చొంగ కార్చే ప్రబుద్ధులు ఉన్న ఈ సమాజంలో సురక్షితంగా గమ్యస్థానం చేరుకుంటే అదృష్టవంతులనే చెప్పాలి. ఓ మహిళ క్యాబ్ లో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

తాను క్యాబ్ డ్రైవర్‌తో ఒంటరిగా ప్రయాణిస్తోంది. క్యాబ్ డ్రైవర్ అసభ్యకర సంభాషతో, అతడి ఉద్దేశాన్ని పసిగట్టింది. వెంటనే తనను తాను రక్షించుకునేందుకు ఓ పథకం వేసింది. దాంతో ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకుంది. మహిళ సోషల్ మీడియాలో క్యాబ్ డ్రైవర్ రైడ్ అనుభవాన్ని పంచుకుంది. ఒంటరిగా ప్రయాణించే మహిళలు డ్రైవర్ నుండి కూడా ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. క్యాబ్ డ్రైవర్ తప్పు చేస్తున్నాడనే అనుమానంతో ఓ మహిళ పరిస్థితి విషమించేలా డ్రామా ప్రారంభించింది.

క్యాబ్‌లో ఇంటికి వస్తుండగా క్యాబ్ డ్రైవర్ రకరకాలుగా మాట్లాడటం ప్రారంభించాడని మహిళ చెప్పింది. మీరు ఎప్పుడైనా సెక్స్ చేశారా అని అతను ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. ఈ ప్రశ్న విన్న మహిళ అప్రమత్తమై తనను తాను రక్షించుకోవడానికి మార్గం వెతకడం ప్రారంభించింది.

సంభాషణ సమయంలో, తనకు పిచ్చి ఉందని, మానసికంగా బాధపడుతున్నానని, ఎవరైనా తన దగ్గరికి వచ్చినప్పుడు, అతన్ని చంపేస్తానని చెప్పింది. తన భర్తను కూడా ఇదే తరహాలో హత్య చేసేందుకు ప్రయత్నించానని వెల్లడించింది. దాంతో డ్రైవర్ ఖంగుతిన్నాడు. కొద్ది సేపు ఇద్దరి మధ్యా మాటల్లేవు. మరైతే మీ భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని క్యాబ్ డ్రైవర్ ఆమెను ప్రశ్నించాడు. అతను ఇంకా బతికే ఉన్నాడు. మళ్లీ నాతో ఎప్పుడైనా ఇలానే ప్రవర్తిస్తే చంపేస్తా అని భర్త గురించి చెప్పుకొచ్చింది.

అటువంటి పరిస్థితిలో, డ్రైవర్ భయపడి ఆమెను సురక్షితంగా ఇంటి వద్ద దింపాడని తెలిపింది. ఏది ఏమైనా అర్థరాత్రి మహిళ ఒంటరిగా ప్రయాణించడం చాలా కష్టమని, అన్ని వేళలా సురక్షితం కాదని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story