Nizamabad: కార్పొరేటర్ భర్త అక్రమ సంబంధం.. చెప్పుతో కొట్టిన మహిళ..
Nizamabad: నిజామాబాద్ నగరం... వినాయక్ నగర్ కార్పొరేటర్ భర్త ఆకుల శ్రీనుపై ఓ మహిళ దాడి చేయడం కలకలం రేపింది. తమ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఆమె తల్లిదండ్రులు కార్పొరేటర్ ఇంటికి వెళ్లి ఆమె భర్తపై దాడికి దిగారు. చెప్పుతో కొట్టారు. తమ కూతురికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడని గతంలో మందలించినా శ్రీను తన తీరు మార్చుకోలేదని.. గత రాత్రి తమ కూతురిని తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురిని తమకు అప్పగించాలంటూ కార్పొరేటర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
తన కూతురిని మోసం చేశాడంటూ కార్పొరేటర్ భర్తపై దాడి
గతంలో మందలించినా శ్రీను తీరు మార్చుకోలేదని ఆగ్రహం
తమ కూతురిని ఎత్తుకెళ్తుండగా పట్టుకున్నాంటున్న తల్లిదండ్రులు
కార్పోరేటర్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన అమ్మాయి తల్లిదండ్రులు
తమ కూతురిని అప్పగించాలంటూ తల్లిదండ్రుల డిమాండ్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com