ప్రైవేట్ పార్ట్స్ బయట పెట్టి అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణీకుడు.. యువతి వీడియో తీసి..

ప్రైవేట్ పార్ట్స్ బయట పెట్టి అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణీకుడు.. యువతి వీడియో తీసి..
మరీ చచ్చిపోతున్నారు.. కొంచెమైనా బుద్ది జ్ఞానం, సిగ్గు శరం లేకుండా ప్రవర్తిస్తున్నారు..

మరీ చచ్చిపోతున్నారు.. కొంచెమైనా బుద్ది జ్ఞానం, సిగ్గు శరం లేకుండా ప్రవర్తిస్తున్నారు.. ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా చూస్తారని, ఏమైనా అనుకుంటారని కానీ లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్లని ఇలాగే వదిలేస్తే మరింత రెచ్చిపోతారని భావించింది. ధైర్యం తెచ్చుకుని పోకిరీ ప్రవర్తనను వీడియో తీసి పోలీసులకు షేర్ చేసింది. దాంతో అతడిని అరెస్ట్ చేశారు. ఈ దృశ్యం కేరళ ఎర్నాకులం బస్సులో చోటు చేసుకుంది.

కదులుతున్న బస్సులో తనతో అనుచితంగా ప్రవర్తించి ప్రైవేట్ పార్ట్స్ బయటపెట్టడంతో ఖంగు తిన్న యువతి అతడిని పోలీసులకు పట్టించింది. సమయానుకూలంగా స్పందించి పోలీసులకు సాయపడింది.ధైర్యవంతురాలైన యువతి అతని అనైతిక ప్రవర్తనను అందరి ముందూ ప్రశ్నించింది. అతడు చేస్తున్న చెత్త పనిని మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ వ్యక్తిపై తాను ఫిర్యాదు చేయదల్చుకున్నానని, అతడిని పోలీసులకు అప్పగించాలని ఆమె బస్సు కండక్టర్‌కు తెలియజేసింది. నేరం అంగీకరించని నిందితుడు బస్సు దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, కండక్టర్, డ్రైవర్ కలిసి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.స్థానిక టెలివిజన్ ఛానెల్‌లు వ్యక్తి యొక్క దృశ్యాలను ప్రసారం చేసాయి.

మహిళ సమీపంలోని త్రిసూర్ నుండి కొచ్చికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తన పక్కనే వచ్చి కూర్చున్న నిందితుడు మొదట్లో మర్యాదగా మాట్లాడాడని ఆమె తెలిపారు. కొంత సమయం తరువాత, అతను ఆమెను అనుచితంగా తాకడం ప్రారంభించాడని, ప్యాంట్‌ విప్పి ప్రైవేట్ పార్ట్స్ బహిర్గతం చేయడం ప్రారంభించాడు. దాంతో అతడికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది. తన మొబైల్ ఫోన్‌ని ఒక చేతిలో పట్టుకుని, దానిని లైవ్ రికార్డింగ్ ఆప్షన్ ఆన్‌లో ఉంచింది.

ఈ సంఘటన గురించి తన సోషల్ మీడియా పోస్ట్‌ను చూసిన తర్వాత, మరో ఐదుగురు మహిళలు కదులుతున్న బస్సులో అదే వ్యక్తితో తమకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని తనకు మెసేజ్ ద్వారా తెలియజేసినట్లు యువతి తెలిపింది. ఆమె ఆందోళన చేసినప్పుడు సహ ప్రయాణికులు అందరూ ఆమెకు సహకరించారు. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని కండక్టర్, డ్రైవర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

నెడుంబస్సేరి పోలీసులు నిందితుడిపై ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు సయాద్ కెకెగా పోలీసులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story