స్నేహితుల కోరిక తీర్చాలట.. షీ టీమ్స్ ను ఆశ్రయించిన యువతి

అప్పు తీర్చనందుకు ఓ యువతిని కోరిక తీర్చాలని బలవంతం చేశాడో వ్యక్తి. అంతేకాకుంగా తన స్నేహితుల కోరిక తీర్చాలని కోరాడు. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన ఓ యువతి ఒక వ్యక్తి దగ్గర అప్పు చేసింది. గడువుతీరినా అప్పు చెల్లించలేక పోయేసరికి తన కోరిక తీర్చాలని సదరు వ్యక్తి కోరాడు. గత్యంతరం లేక యువతి అంగీకరించింది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు యువతికి తెలియకుండా వీడియో తీశాడు. మరుసటి రోజు ఆ వీడియోలను యువతికి చూపించి తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని ఒత్తిడి చేశాడు. లేకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తానని బెదిరించాడు. యువతి అంగీకరించకపోవడంతో వీడియోలను సోషల్ ఫ్లాట్ ఫామ్ పై పోస్ట్ చేశాడు. మానసి క్షోభకు గురైన భాదితురాలు షీ టీంను ఆశ్రయించింది. నిందితులు పరారీలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com