మలక్‌పేటలో మొండెం లేని మహిళ తల కలకలం

మలక్‌పేటలో మొండెం లేని మహిళ తల కలకలం
హైదరాబాద్‌ మలక్‌పేటలో దారుణం జరిగింది. మొండెం లేని మహిళ తల లభ్యమైంది

హైదరాబాద్‌ మలక్‌పేటలో దారుణం జరిగింది. మొండెం లేని మహిళ తల లభ్యమైంది. తీగలగూడ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్‌లో మహిళ తలను స్థానికులు గుర్తించారు. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్‌ టీం, డాగ్ స్క్వాడ్‌లతో దర్యాప్తు చేపట్టారు.

అడిషనల్ డీసీపీ ఆనంద్, మలక్‌పేట ఎస్సై శ్రీనివాస్, మలక్‌పేట, చాదర్‌ఘట్ క్రైం సిబ్బంది.. అన్నీ కోణాల్లో హత్యను ఛేదించే పనిలో పడ్డారు. మహిళను ఎక్కడో హత్య చేసి మూసీలో తలను పడేశారని పోలీసుల అనుమానిస్తున్నారు. మహిళ తలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story