CRIME: స్కానింగ్ కోసం వస్తే.. మహిళపై దారుణం

మహిళలపై లైంగిక వేధింపులు ఏమాత్రం ఆగడం లేదు. విశాఖలో అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ పట్ల సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. అసభ్యకరంగా తాకుతూ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. ప్రతిఘటించిన ఆ యువతి.. కామాంధుడు నుంచి తృటిలో తప్పించుకుంది. తలకు గాయమైన ఓ మహిళ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. తలకు గాయంతో ఆస్పత్రికి వచ్చిన ఆమెను పరీక్షించిన వైద్యులు.. స్కానింగ్ చేయించాలని సూచించారు. దీంతో అదే ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ సెంటర్‌కు స్కానింగ్ కోసమని బాధితురాలు వెళ్లింది. అయితే స్కానింగ్ కోసం వచ్చిన మహిళ పట్ల స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి ప్రకాష్ అసభ్యంగా ప్రవర్తించారు. తలకు గాయమై ఆస్పత్రికి వస్తే.. స్కానింగ్ కోసం దుస్తులు తీసేయాలంటూ మహిళకు చెప్పారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతగాడి ప్రవర్తనతో షాక్ తిన్న బాధితురాలు వెంటనే గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆస్పత్రిలోని ఇతర రోగులు స్కానింగ్ సెంటర్ వద్దకు పరుగులు తీశారు. దీంతో తనపట్ల స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి వ్యవహరించిన తీరు గురించి బాధితురాలు వారితో వాపోయింది. దీంతో ఆస్పత్రికి వచ్చిన వారితో పాటు స్థానికులు స్కానింగ్ సెంటర్ ఇంఛార్జిని చితకబాదారు.
విశాఖ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
విశాఖలోని ఓ స్కానింగ్ సెంటర్లో మహిళను అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇదివరకే కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబు ఆదేశాలతో నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com