హైదరాబాద్‌లో యువతి మిస్సింగ్.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లి

హైదరాబాద్ దోమలగూడలో అదృశ్యమైన యువతి భార్గవి ఆచూకీ ఇంత వరకు తెలియలేదు.. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆమె కోసం గాలింపు జరుపుతున్నారు.. ఇక ఈ కేసులో సీసీఫుటేజ్ కీలకలంగా మారింది.. కాచిగూడ, మలక్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌లో భార్గవి కదలికలను గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
మొదట కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన భార్గవి.. అక్కడ రైలు ఎక్కకుండా తిరిగి పంజాగుట్ట వరకు వచ్చింది.. మళ్లీ పంజాగుట్ట సెంట్రల్ వద్ద బస్సు ఎక్కేందుకు ప్రయత్నించింది.. ఆటోలో మలక్‌పేట వరకు వెళ్లింది.. ముసారంబాగ్ మెట్రో స్టేషన్ కింద సెల్‌ఫోన్ కింద పడేసింది.. అక్కడ్నుంచి ఆమె ఎటు వెళ్లిందనేది తెలియాల్సి ఉంది.. ఆమె స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ఈనెల 10న సాయంత్రం భార్గవి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది.. అయితే, ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. భార్గవి ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆరువేల రూపాయలు తీసుకెళ్లినట్లుగా తల్లిదండ్రులు చెప్తున్నారు. భార్గవికి ఏడాది క్రితం వివాహమైంది.. అయితే, ఆమె దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు.. మా కూతుర్ని క్షేమంగా ఇంటికి చేర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com