Hyderabad : భర్త, మేనమామ వేధింపులు.. మహిళా న్యాయవాది ఆత్మహత్య

Hyderabad :  భర్త, మేనమామ వేధింపులు.. మహిళా న్యాయవాది ఆత్మహత్య
X
Hyderabad : లక్ష్మీ విహార్‌ ఫేజ్‌- 1 డిఫెన్స్‌ కాలనీలో నివాసముంటున్న మహిళా న్యాయవాది శివాని భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి చనిపోయింది

Hyderabad : హైదరాబాద్ లోని చందానగర్‌‌‌‌లో విషాదం నెలకొంది.. లక్ష్మీ విహార్‌ ఫేజ్‌- 1 డిఫెన్స్‌ కాలనీలో నివాసముంటున్న మహిళా న్యాయవాది శివాని భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. ఆమె బలవన్మరణానికి కారణం భార్యాభర్తల మధ్య గొడవేనని తెలుస్తోంది. శివాని అయిదేళ్ళ క్రితం అర్జున్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి రెండేళ్ళ కుమారుడు ఉన్నాడు.

ఐతే శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శివాని ఆత్మహత్యకి పాల్పడింది. శివాని భర్తని చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివాని తల్లి ఫిర్యాదు మేరకు.. శివానికి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో మేనమామ ఆమె బాధ్యతలు తీసుకొని న్యాయవాదిని చేశారు. అయితే శివానిని చదివించడంతో తాను అప్పుల పాలయ్యానని.. రూ.10లక్షలు ఇవ్వాలని మేనమామ వేధించేవాడు. పెళ్లి అయ్యాక డబ్బులు మేనమామకి ఎందుకు ఇస్తున్నావ్ అని భర్త అర్జున్ కూడా శివానిని వేధింపులకి గురిచేసేవాడు.

ఈ క్రమంలో శనివారం జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన శివాని ఆత్మహత్యకి పాల్పడింది. అయితే తన కుమారుడి రెండో పుట్టినరోజు ఇవ్వాళా జరగాల్సి ఉండగా శివాని చనిపోవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీని పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story