Hyderabad Metro: ఆకతాయి అసభ్య ప్రవర్తన.. మెట్రో లిప్ట్ ఎక్కి.. దుస్తులు విప్పి..

Hyderabad Metro: ఆకతాయిల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.. జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వీరి అసభ్య చేష్టలకు అంతు లేకుండా పోతోంది.
రద్దీగా ఉండే మెట్రో స్టేషన్ లిప్ట్ లోకి ఎక్కిన మహిళ ముందు ఓ యువకుడు బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించడంతో ఎస్సార్ నగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఖైరతాబాదుకు చెందిన ఓ యువతి మంగళవారం అమీర్ పేటలో షాపింగ్ ముగించుకుని తిరిగి ఖైరతాబాద్ వెళ్లేందుకు అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లిప్ట్ ఎక్కింది.
ఆమె వెనుకే లిప్ట్ లోకి ప్రవేశించిన రాజు అనే యువకుడు తన దుస్తులు విప్పి అసభ్య చేష్టలతో హడలెత్తించాడు. దీంతో లిప్ట్ నుంచి పరుగున బయటకు వచ్చిన బాధితురాలు విషయాన్ని మెట్రో సిబ్బందికి వివరించింది. . వెంటనే వాళ్లు రాజుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజు.. రోజూ మెట్రో స్టేషన్ లిఫ్ట్ వద్దే ఉంటూ ఒంటరిగా వెళ్లే మహిళల ముందు ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు రాజును అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com