ప్రేమ పెళ్లి.. కారులో వచ్చి యువతిని కిడ్నాప్‌ చేసిన..

ప్రేమ పెళ్లి..  కారులో వచ్చి యువతిని కిడ్నాప్‌ చేసిన..
ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి ఇష్టంలేకపోవడంతో ..

వికారాబాద్‌లో యువతి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం తన అక్కతో కలిసి షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వస్తున్న దీపిక అనే యువతిను... కొంతమంది కారులో వచ్చి కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వికారాబాద్‌కు చెందిన దీపిక... అదే ప్రాంతానికి చెందిన అఖిల్‌... 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి ఇష్టంలేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం దీపికను అమె తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకొచ్చారు. ఈ వివాదంలో భాగంగానే శనివారంనాడు అఖిల్‌, దీపికలు వికారాబాద్‌ కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. భర్తే.. దీపికను కిడ్నాప్‌ చేసి ఉంటాడని దీపిక అనుమానం వ్యక్తమవుతుంది. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి అనంతగిరి వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story