రూ.15వేల అప్పు.. యువకుడిని కత్తితో పొడిచి హత్య

రూ.15వేల అప్పు.. యువకుడిని కత్తితో పొడిచి హత్య

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ హత్య జరిగింది.15వేల అప్పు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆర్ధిక లావాదేవీల విషయంలో రఫీ, సుభాని ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సుభానిని.. రఫీ కత్తితో పొడిచి హత్య చేశాడు. నందులపేటలోని నవయుగ బారులోఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడిని కత్తితో పొడుస్తున్న విజువల్స్‌ సీసీపుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story