దారుణం.. మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ యువకుడు

దారుణం.. మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ యువకుడు
అతడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారయత్నం చేశాడు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై.. నవీన్ అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పట్టణంలోని కూడకూడ రోడ్డులోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో నవీన్‌ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ ఉంటాడు. అతడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారయత్నం చేశాడు. మైనర్ బాలిక ముభావంగా ఉండటంతో.. ఆమె తల్లి ప్రశ్నించింది. నవీన్ తనపై దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం చేసినట్టు.. బాలిక తన తల్లికి చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మైనర్ బాలిక తల్లి.. స్థానికుల సహాయంతో.. నవీన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story