Ramagundam Railway Station: ట్రైన్‌కు ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్య.. అందరూ చూస్తుండగానే..

Ramagundam Railway Station: ఈకాలంలో ప్రతీ ఒక్కరు చిన్న చిన్న సమస్యలకు కూడా చావే పరిష్కారం అనుకుంటున్నారు. వయసుతో సంబంధం లేదు.. బతకడం కష్టంగా ఉంది అన్న ఆలోచన వస్తే చాలు.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందులోనూ చాలామంది తమ చావుకు కారణాలు తెలియాలని లెటర్ రాస్తున్నారు.. లేదా సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇవేవి లేకుండానే అందరు చూస్తుండగా ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు ఓ వ్యక్తి. వేగంగా వస్తున్న ట్రైన్‌కు ఎదురుగా వెళ్లి నిల్చున్నాడు. అతడిని కాపాడే సమయం కూడా ఎవ్వరికీ ఇవ్వకుండా ఒక్కసారిగా ట్రైన్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో ఉన్న అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇంకా చాలా జీవితం ఉన్న యువకుడు ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చూసినవారిని కలచివేసింది.
పెద్దపల్లిలోని రామగుండం రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంజయ్‌కుమార్‌గా గుర్తించారు రైల్వే పోలీసులు. అనంతరం తన గురించి వివరాలు సేకరించారు. అతడు సికింద్రాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్ షాపులో పనిచేస్తున్నట్టు తెలిసింది. తన మరణ వార్తను కుటుంబానికి అందజేయగా సంజయ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని వారు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com