Bayya Sunny Yadav : ఎన్.ఐ.ఏ అదుపులో బయ్యా సన్నీయాదవ్

Bayya Sunny Yadav :  ఎన్.ఐ.ఏ అదుపులో బయ్యా సన్నీయాదవ్
X

బైక్ రైడర్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బయ్యా సన్నీయాదవ్. తన బైక్ గురించి, టూర్స్ గురించిన విశేషాలను యూ ట్యూబ్ లో పంచుకుంటూ ఫైనాన్సియల్ గా గట్టెక్కుతున్నా అని చెప్పేవాడు. కానీ అతను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించాడని మరో యూ ట్యూబర్ నా అన్వేష్ చెప్పడం.. తర్వాత అతనిపై సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు కావడం జరిగింది. అయితే కొన్నాళ్లుగా విదేశాల్లో ఉంటున్నాడు సన్నీ. ఈ నేపథ్యంలో సూర్యాపేట పోలీస్ లు అతనిపై లుక్ అవుట్ నోటీస్ లు జారీ చేశారు.

అయితే బయ్యా సన్నీ యాదవ్ రీసెంట్ గా ఇండియా బోర్డర్ అయిన వాఘా మీదుగా పాకిస్తాన్ కు వెళ్లినట్టు.. అక్కడ బైక్ టూర్ ను పూర్తి చేసినట్టు పోలీస్ లు గుర్తించారు. కొన్ని రోజుల క్రితమే పహల్గామ్ దాడులు జరగడం.. జ్యోతి మల్హోత్రా అనే యూ ట్యూబర్ మన రహస్యాలన్నీ పాకిస్తాన్ కు చెప్పడం చూశాం. సన్నీ కూడా అదే చేశాడు అని కాదు కానీ ఇలాంటి పరిస్థితిలో పాక్ వరకూ వెళ్లడం రిస్క్ అని తెలిసినా ఎందుకు వెళ్లాడు..? కేవలం బైక్ టూర్ మాత్రమే చేసేట్టైతే అక్రమంగా పాక్ లోకి ఎందుకు వెళ్లాడు.. వంటి కోణాల్లో ప్రశ్నించేందుకు అతన్ని చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఎన్ఐఏ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. మరి అతను కేవలం యూ ట్యూబర్ గా వెళ్లాడా లేక జ్యోతి మల్హోత్రాలాగా ఇతని కేస్ లోనూ ఇంకేవైనా ట్విస్ట్ లు ఉంటాయా అనేది చూడాలి.

Tags

Next Story