Zomato: వాటర్ పేరుతో మాటలు కలిపి యువతిని బలవంతంగా.. డెలివరీ బాయ్ అరెస్ట్..

Zomato: వాటర్ పేరుతో మాటలు కలిపి యువతిని బలవంతంగా.. డెలివరీ బాయ్ అరెస్ట్..
Zomato: అర్థరాత్రి అయినా ఆర్డర్ చేసిన అరగంటలో ఫుడ్ మీ ముందుంటుంది. అదే ఆన్‌లైన్ ఆర్డర్ సర్వీస్ జొమాటో థీమ్. తన సేవలతో‌ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

Zomato: అర్థరాత్రి అయినా ఆర్డర్ చేసిన అరగంటలో ఫుడ్ మీ ముందుంటుంది. అదే ఆన్‌లైన్ ఆర్డర్ సర్వీస్ జొమాటో థీమ్. తన సేవలతో‌ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. కానీ కొంత మంది ఉద్యోగుల వల్ల సంస్థ పేరు పాడవుతోంది. ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తి కస్టమర్‌ ఒంటరిగా ఉందని తెలుసుకున్నాడు. వాటర్ పేరుతో మాటలు కలిపాడు. ఆమెను వేధించి ముద్దు పెట్టుకున్నాడు. ఈ మేరకు పూణేకు చెందిన 19 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనకు ఆహారం అందజేసిన తర్వాత డెలివరీ చేసిన వ్యక్తి తాగేందుకు నీళ్లు అడిగాడని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను నీరు తెచ్చిన వెంటనే రూమ్‌లో ఎవరెవరు ఉంటారని డెలివరీ చేసిన వ్యక్తి తనను అడగడం ప్రారంభించాడని చెప్పింది. అప్పుడు తాను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఫ్లాట్‌లో ఉంటున్నానని, ఇప్పుడు వాళ్లిద్దరు తమ ఇళ్లకు వెళ్లారని చెప్పింది. దాంతో యువతి ఒంటరిగా ఉందని తెలుసుకున్న డెలివరీ మ్యాన్ వెంటనే యువతిని మరో గ్లాసు నీళ్లు కావాలని అడిగాడు.

అయితే ఈసారి మరో గ్లాసు నీళ్ల కోసం యువతి వెనక్కి తిరిగిన వెంటనే, డెలివరీ మ్యాన్ ఆమెను వెనుక నుంచి తట్టి, ఆమె చెంపపై రెండుసార్లు బలవంతంగా ముద్దుపెట్టాడు. ఈ చర్య తర్వాత.. నేను నీ మామయ్య లాంటివాడని, నీకు ఏదైనా సహాయం కావాలంటే సంకోచించకుండా అడుగు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు.

అతడు వెళ్లిపోయిన తర్వాత తన వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ప్రారంభించాడని యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. ఈ సంఘటన సెప్టెంబర్ 17 రాత్రి 9:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. యువతి ఇంజినీరింగ్ విద్యార్థి. కోంద్వాలోని ఓ కళాశాలలో చదువుతోంది. ఇంతకుముందు ఫిర్యాదు చేయడానికి సంకోచించానని, అయితే వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి విసిగిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసానని తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story