ఇంటివాడైన CSK క్రికెటర్

ఇంటివాడైన CSK క్రికెటర్

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ఉత్కర్ష పవార్‌ ను శనివారం వివాహం చేసుకున్నాడు. ఉత్కర్ష కూడా క్రికటరే కావడం ఇద్దరినీ దగ్గరకు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్‌ను అద్భుతంగా ఆడిన గైక్వాడ్, జట్టు 5వ టైటిల్‌లో కీలక పాత్ర పోషించాడు. సీజన్ ముగిసిన తర్వాత, యువ ఓపెనర్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా భారత జట్టులో చేరాల్సి ఉంది. అయితే, అతను పెళ్లి చేసుకునేందుకు 5 రోజులకిగాను... ఈవెంట్ నుంచి వైదొలిగాడు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు గైక్వాడ్.

గైక్వాడ్ వివాహ వేడుకకు హాజరైన CSK ఆటగాళ్లలో శివమ్ దూబే మరియు ప్రశాంత్ సోలంకి వంటివారు ఉన్నారు. శిఖర్ ధావన్, రషీద్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్ మరియు ఉమ్రాన్ మాలిక్ వంటి ప్రముఖ క్రికెటర్లు సోషల్ మీడియాలో కొత్తగా పెళ్లయిన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

గైక్వాడ్ IPL 2023 సీజన్ తన తోటి ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి కీలక భిగస్వామ్యాలను నెలకొల్పాడు. 16 మ్యాచుల్లో గైక్వాడ్ 42.14 సగటుతో 590 పరుగులు చేశాడు. 2023 IPL టోర్నమెంట్ లో నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. అందులో 92 అత్యమమైన స్కోరు. అతను CSKకు 2019 నుంచి ఆడుతున్నాడు. IPL కెరీర్‌లో, అతను 39.07 సగటుతో, 135.52 స్ట్రైక్ రేట్‌తో 1,797 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఒక సెంచరీ మరియు 14 అర్ధశతకాలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 101*. గైక్వాడ్ భారతదేశం తరపున 9, T20లు ఆడాడు. అందులో అతను ఒక హాఫ్ సెంచరీ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story