స్వామివారిని దర్శించుకున్న జేపీ నడ్డా

స్వామివారిని దర్శించుకున్న జేపీ నడ్డా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వీఐపీ బ్రేక్‌ సమయంలో.. ఆలయంలోకి వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వీఐపీ బ్రేక్‌ సమయంలో.. ఆలయంలోకి వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకున్న అనంతరం... మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో ఆయనకు వేదాశీర్వాదం చేసి తీర్థప్రసాదాలు అందించారు పండితులు. నడ్డాతో పాటు శ్రీవారి సేవలో మాజీ సీఎం నల్లారీ కిరణ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు, సుజనాచౌదరి, సీఎం రమేష్‌, సునీల్‌ దియోధర్‌ తదితరలు పాల్గొన్నారు. వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కలగడం చాలా అనందంగా ఉందన్నారు జేపీ నడ్డా. దేశ ప్రజలంతా.. సుఖ సంతోషాలతో ఉండాలి శ్రీవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story