750 కిలోల బరువున్న బంగారు అంబారీని మోసిన అభిమన్యు

750 కిలోల బరువున్న బంగారు అంబారీని మోసిన అభిమన్యు

దసరా వేడుకలనగానే గుర్తొచ్చేది మైసూరు. నమ్మద హబ్బ పేరిట ఏటా దసరా ఉత్సవాలను నిర్వహిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. కర్నాటక సంస్కృతీ సంప్రదాయలకు ఈ ఉత్సవాలు చిహ్నంగా నిలుస్తాయి. మైసూరు మహారాజు కాలం నుండి దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే.. ఈ సారి దసరా ఉత్సవాలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అయినప్పటికి సాంప్రదాయరీతిలో , భక్తిశ్రద్దలతో దసరా ఉత్సవాలను నిర్వహించారు.

ఇక... మైసూర్‌ ఉత్సవాల్లో హైలెట్‌ ఏనుగుల జంబూ సవారీ!. మైసూరు మహారాజు వారి కులదైవం చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. అమ్మవారికి సీఎం యడ్యూరప్ప ప్రత్యేక పూజలు చేశారు. ఏటా వేలాది మంది పాల్గొనే ఈ సవారీలో ఈసారి కేవలం 300 మంది అతిథులు మాత్రమే పాల్గొన్నారు. అది కూడా కోవిడ్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన వాళ్లకే అనుమతించారు. జంబూ సవారిలో అభిమన్యు ఏనుగు.... ఠీవీగా నడిచింది. 750 కిలోల బరువున్న బంగారు అంబారీని అభిమన్యు మోసింది. అభిమన్యు వెంట కావేరి, విజయ,గోపి అనే ఏనుగులు నడిచాయి.

సవారి కోసం ఏనుగులను అందంగా అలంకరించారు. తంజావూరుకు చెందిన మొత్తం ఐదుగురు కళాకారులు... అభిమన్యు. కావేరి, విజయ, గోపి ఏనుగులను చక్కగా అలంకరించారు. జంబూ సవారి ఉండటంతో...... మైసూరులోని కేఆర్ సర్కిల్‌ తోపాటు...ఆ మార్గంలో..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో..... కర్ణాటక సంప్రదాయలను వివరించే శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మైసూర్‌ ప్యాలెస్‌... విద్యుద్దీపాలంకరణతో... దేవలోకంగా మారింది. నవరాత్రి ఉత్సవాల అనంతరం... కలర్ పుల్ లైటింగ్స్‌ తొలగిస్తుండటంతో.. జనం పెద్ద సంఖ్యలో మైసూర్ ప్యాలెస్‌ను చూసేందుకు వెళ్తున్నారు. సాధారణంగా మైసూర్ ప్యాలెస్‌ లైటింగ్స్‌ నెలరోజులు తక్కువ కాకుండా కొనసాగించేవారు. కానీ కరోనా కారణంగా.. పదిరోజులకే పరిమితం చేశారు. ఇక అలంకరణ నిడివి 50 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేశారు. సాధారణంగా ఇది 250 కిలోమీటర్ల నిడివితో ఉండేది. దేవలోకం దిగివచ్చిందా అన్నట్లు కళ్లు జగేల్‌మనే మైసూర్‌ ప్యాలేస్‌ అందాలు, విశ్వవిఖ్యాత జంబూ సవారీ.. అందరీని కనువిందు చేస్తున్నాయి.

Tags

Next Story