శబరిమలలో ఇవాళ మకరజ్యోతి దర్శనం!

X
By - TV5 Digital Team |14 Jan 2021 11:18 AM IST
శబరిమలలో ఇవాళ మకరజ్యోతి దర్శనం జరగనుంది. ఈ సందర్భంగా అయ్యప్ప సన్నిధానానికి తిరునాభరణం ఊరేగింపు చేరుకోనుంది.
శబరిమలలో ఇవాళ మకరజ్యోతి దర్శనం జరగనుంది. ఈ సందర్భంగా అయ్యప్ప సన్నిధానానికి తిరునాభరణం ఊరేగింపు చేరుకోనుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది అయ్యప్ప భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లి ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకోవాలని భావిస్తున్నారు. మకరజ్యోతిని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో శబరిమలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తుండటంతో శబరిమలలో అయ్యప్పలు, భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com