తెలంగాణలో మొదలైన ఎన్నికల కసరత్తు..!

తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచే కసరత్తును మొదలుపెట్టింది తెలంగాణ ఎన్నికల సంఘం. ఎక్కడుంటే అక్కడే ఓటు వేసేలా పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.ప్రయోగాత్మకంగా జీహెచ్‌ఎంసీలో అధ్యయనం చేస్తుంది ఈసీ. గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 30 సర్కిళ్లలో 4 వేల846 కాలనీలు, బస్తీలున్నాయి.2022 జనవరి నాటి జాబితా ప్రకారం 86.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.అయితే పోలింగు కేంద్రాల వివరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.ఒక ఇంట్లో ఉన్న ఓటర్లతో పాటు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు మరో ప్రాంతంలోని పోలింగు కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. దీనిపై ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా సమయంలో వ్యాక్సినేషన్,శానిటైజేషన్ కు అమలు చేసిన వ్యూహాన్ని ఇప్పుడు బస్తీ,కాలనీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపైన ప్రయోగించనుంది ఈసీ.
ఇక రూరల్ ప్రాంతాల్లో ఓ గ్రామాన్ని ఒక్కో యూనిట్‌గా తీసుకున్న ఈసీ...ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నరు. అర్భన్ ప్రాంతాల్లోనూ కాలనీ,బస్తీని ప్రామాణికంగా తీసుకుంది ఈసీ. పోలింగు కేంద్రాలను ఏర్పాటుపై గ్రేటర్ పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న రెండు వార్డుల్లో ప్రయోగాత్మకంగా అధ్యయనం ప్రారంభించింది. మలక్‌పేట పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట.. ముషీరాబాద్ పరిధిలోని అడిక్‌మెట్ వార్డులను ఎంపిక చేశారు. 2022 జనవరి నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఓల్డ్ మలక్‌పేట వార్డులోని 19 కాలనీల్లో 56వేల128 మంది ఓటర్లు, అడిక్‌మెట్ వార్డులోని 22 కాలనీల్లో 42వేల589 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వారిని కాలనీ వారీగా వేరు చేసి ఓటర్లు ఉన్న ప్రాంతంలోనే ఎన్ని పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది నిర్ధారిస్తారు.
ఇక పట్టణ ప్రాంతాల్లో పోలింగు కేంద్రాల పరిధిలో ఓటర్ల విషయంలో రాజకీయ పార్టీలు, ఓటర్ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారాన్ని గుర్తించేందుకు ఈసీ అధ్యాయనం చేస్తోంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జీహెచ్‌ఎంసీలో ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో అధికారులు ముందుగా ఇక్కడ నుంచే మొదలు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com