ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి త్రిశూల వ్యూహం..?

ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి త్రిశూల వ్యూహం..?
వైకుంఠపాళిని తలపిస్తోనన ఉదయగిరి వైసీపీ రాజకీయాలు

ఉదయగిరిపై మేకపాటి ఫ్యామిలీ గురిపెట్టిందా? ఉదయగిరిని చేజిక్కించుకునేందుకు అసమ్మతి వర్గం పావులు కదుపుతోందా? నాడు అసమ్మతికి ఆజ్యం పోసి నేడు అసమ్మతి నేతలనే రాజమోహన్ రెడ్డి తరిమికొడుతున్నారా? మేకపాటి రాజమోహన్ రెడ్డి త్రిశూల వ్యూహం అమలు చేస్తున్నారా ? ఉదయగిరి వైసీపీ రాజకీయాలు వైకుంఠపాళిని తలపిస్తున్నాయా?

నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న కుటుంబాలలో మేకపాటి కుటుంబం ఒకటి. సుదీర్ఘ కాలం కాంగ్రేస్ పార్టీలో ఉన్నప్పటికి.. తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్లు ఉండి ప్రస్తుతం వైసీపిలో కోనసాగుతున్నప్పటికి మెదటి నుండి మేకపాటి కుటుంబం ఒడిదుడుకులనే ఎదుర్కొంటోందని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ వైసీపీలో చేరిన మేకపాటి రాజమోహన్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఉపఎన్నికలకు వెళ్ళారు. 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచినప్పటికి ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. 2019లో అసలు సీటే రాలేదు మేకపాటి రాజమోహన్ రెడ్డికి. అయితే తన రాజకీయ వారసుడు మేకపాటి గౌతంరెడ్డికి మంత్రి పదవి వచ్చిందిలే అనుకుని సంతృప్తి చెందినా గౌతంరెడ్డి కాలం చేయడంతో మేకపాటి రాజమోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే తన రాజకీయ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు రాజకీయాలకు పరిచయమే లేని తన రెండో కుమారుడిని ఆత్మకూరు అభ్యర్దిగా పరిచయం చేసి తన మార్కు రాజకీయాన్ని చాటుకున్నారు రాజమోహన్ రెడ్డి. అంతలోనే ఉదయగిరి గడ్డ మీద సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధికార వైసీపీపై తిరుగుబాటు చేయడం, పార్టీ నుండి సస్సెండ్ కావడం చకచక జరిగిపోవడంతో మరోసారి వ్యూహాలకు పదును పెట్టారట రాజమోహన్ రెడ్డి.

ఇక ఉదయగిరి కోట పై ఎవర్ని కూర్చోబెట్టాలా అని మేకపాటి మరోసారి తన వ్యూహాలకు పదును పెడుతున్నారట. మేకపాటి కుటుంబానికి రాజకీయ ఎదుగుదలకు కారణమైన ఉదయగిరి పై మరో నేతను అడుగుపెట్టనివ్వకుండా ఉండాలి.. గొడవలు సర్దుమణగాలంటే మేకపాటి కుటుంబం నుండి ఒకరు అభ్యర్దిగా ఉంటున్నట్టు సంకేతాలు బయటకు రావాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్లాన్ ఎ అమలు చేశాడట. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనా రెడ్డి ఉదయగిరి నుండి బరిలో ఉండబోతోందంటూ ప్రచారం కల్పించారట. దీంతో కొందరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరిలో పట్టుండటం.. చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెను బరిలోకి దించితే ఆమె విజయం తథ్యం అనుకొని సీటు ఆశించిన నేతల్లో కొందరు సైలెంట్ అయ్యారట. కొందరు మాత్రం ఇంత వరకు ఉదయగిరిలొ మహిళ పోటీ చేయలేదు కాబట్టి పలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయంటూ తెరమీదకు తీసుకొచ్చారట. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్లాన్ బిగా కొత్త వ్యూహాన్ని తెరమీదకు తీసుకొచ్చారట. ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె భర్త, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న కొడుకైన వంశీ కృష్ణని తెరమీదకు తీసుకొచ్చి ఉన్న కాస్తో కూస్తో తిరుగుబాటు దారులను వెనుదిరిగేలా చేశారట.

అయితె ఎవరు ఊహించని విధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్లాన్ సీ ని అమలు పరుస్తున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి మొదటి నుండి పట్టుదల కలిగిన వ్యక్తి. అంతే కాదు దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డిని ఎదురించి సొంత పార్టీలోనే వేరు కుంపటి పెట్టిన నేత. చంద్రశేఖర్ రెడ్డి కుమార్తను, కుమార్తె భర్తను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నామని చెప్పి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నా రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డికి అన్యాయం చేశారన్న మచ్చను కొంత వరకు తొలగించారట. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యూహాలు ఎవరికీ అంతుబట్టడంలేదట. పైకి రచనా రెడ్డి పేరు చెప్పి లోపల మాత్రం తన రెండో తమ్ముడు రాజారెడ్డి వస్తున్నాడని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. దీంతో మేకపాటి కుటుంబం ఉదయగిరి వదిలే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ఇటీవల కుటుంబ సభ్యులు కూర్చొని ఈ నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ద్వారా ప్రకటన చేయిస్తే నియోజకవర్గంలొ ఉన్న అసమ్మతి నేతలు ఏకతాటి పైకి వస్తారని రాజమోహన్ రెడ్డి ఆలోచనట. ఇదంతా గమనిస్తున్న ఉదయగిరి నియోజకవర్గం తమదంటె తమదే అంటు జుట్టులు పట్టుకున్న నేతలు ముక్కున వేలేసుకుంటున్నారట.

అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరుసార్లు పోటీ చేసిన నియోజకవర్గంలో తనను కాదని మరో సోదరుడికి టికెట్ ఇస్తే ఉదయగిరిలో పట్టున్న సిట్టింగ్ ఎమ్మేల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహకరిస్తాడా అన్న చర్చ జరుగుతోందట. ఉన్న నాలుగు గ్రూపులను రాజమోహన్ రెడ్డి ఎలా ఏకతాటి పైకి తెస్తారు అసలే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో ఇది సాధ్యమా అని ఉదయగిరి ఓటర్లకు అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయిందట.

Tags

Read MoreRead Less
Next Story