మరాఠా గడ్డపై బీఆర్ఎస్ ఉనికి చాటుకుంటుందా?

మరాఠా గడ్డపై బీఆర్ఎస్ ఉనికి చాటుకుంటుందా?
తెలంగాణ బీఆర్ఎస్ లీడర్లు పక్క రాష్ట్రాలపై కన్నేశారా? మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ ఆరాటపడుతోందా?

తెలంగాణ బీఆర్ఎస్ లీడర్లు పక్క రాష్ట్రాలపై కన్నేశారా? మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ ఆరాటపడుతోందా? మహా ఎన్నికలపై మైనార్టీ ఎమ్మెల్యే నజర్ పెట్టారా? కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించింది అందుకేనా మరాఠా గడ్డపై పోటీకి బీఆర్ఎస్ లీడర్లు సై అంటున్నారా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో బోధన్‌ బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి. బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు సీఎం కేసీఆర్ బంఫర్ ఆఫర్ ఇచ్చారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట బరిలో దిగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బోధన్‌తో పాటు అటు మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ పరిధిపై ఫోకస్ చేయాలని షకీల్ కు గులాబీ బాస్ టాస్క్ అప్ప గించారట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా ను ఈ సారి ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్దం ఉండాలని సూచించారట గులాబీ బాస్. దీంతో షకీల్ తన సతీమణి అయేషా ఫాతిమాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆమె బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండం ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయేషా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఎన్నికల నాటికి అప్పటి పరిస్దితులను బట్టి షకీల్ స్దానంలో ఆయన భార్యను అసెంబ్లీకి పంపే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు బోధన్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

అయితే షకీల్ ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నా మా ఇంట్లో ఈ సారి రెండు పదవులు ఖాయమంటూ సన్నిహితుల వద్ద చెబుతున్నారట. దీంతో షకీల్‌తో పాటు ఆయన భార్య కూడా ఈ సారి ఎన్నికల బరిలో దిగడం ఖాయమని బోధన్ బీఆర్ఎస్‌లో టాక్ వినిపిస్తోంది. అధినేత సూచనలతో ఎమ్మెల్యే షకీల్ మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే సరిహద్దు జిల్లాల ఎమ్మెల్యేలు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారట. నాందేడ్ జిల్లాలో మూడు సభలు విజయవంతం చేయడంలో షకీల్ కీలకపాత్ర పోషించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో నాందేడ్ పార్లమెంట్ బరిలో షకీల్ లేదా ఆయన భార్య ఫాతిమాను బరిలో దించాలనే ముందు చూపుతోనే గులాబీ బాస్ షకీల్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. గత నెలలో ఔరంగాబాద్ సభ ఏర్పాట్లను షకీల్ పర్యవేక్షించగా ..రంజాన్ మాసంలో షకీల్ సతీమణి ఫాతిమా నాందేడ్‌లో ఇప్తార్ విందు ఏర్పాటు చేయడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నాందేడ్‌లో మైనార్టీ ఓట్లు అధికంగా ఉండటంతో షకీల్

కుటుంబం నుంచి ఒకరిని బరిలో దింపాలనే ఆలోచన లో గులాబీ పార్టీ ఉందట. ఇందులో భాగంగానే నాందేడ్ లో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు ప్లాన్ చేశారట ఎమ్మెల్యే షకీల్. మరాఠా గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని తహతహ లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ షకీల్ లేదా ఆయన సతీమణి ఇద్దరిలో ఒకరిని మహారాష్ట్ర సార్వత్రిక్ ఎన్నికల బరిలోకి దించాలని తీవ్రంగా కసరత్తు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆయేషా బోధన్ ఎమ్మెల్యే బరిలో నిలుస్తారా.. నాందేడ్ పార్లమెంట్ పై గురి పెడతారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Tags

Read MoreRead Less
Next Story