నోటి దురుసుకు భారీ మూల్యం తప్పదా?

నోటి దురుసుకు భారీ మూల్యం తప్పదా?
వైసీపీ యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రజా క్షేత్రంలో ధైర్యంగా తిరగలేకపోతున్నారా? బయటకొస్తే ప్రజల నిరసన సెగలతో నిగ్రహం కోల్పోతున్నారా ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడటంపై కన్నబాబు రాజుపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికుతోందా

నోటి దురుసుతో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు వార్తల్లోకెక్కడం నిత్యకృత్యమైపోయింది. అసలే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ప్రజలు నోటి దురుసు ఎమ్మెల్యేకు ఎక్కడికక్కడ నిరసన సెగలతో చుక్కలు చూపిస్తున్నారు. అయినా ఎమ్మెల్యే వ్యవహార శైలి మారడం లేదని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనా నోరేసుకుని పడిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే దురుసుతనంతో వ్యవహరించడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్టైలే డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన చేతిలో అధికారం ఉండాలి. ఆ అధికారoతో అందరిపై విరుచుకు పడాలి అనేది ఆయన నైజం అని నియోజవర్గంలో చర్చ నడుస్తోంది. 2014 ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబురాజు 2014 తర్వాత టీడీపీలోకి జంప్ చేశారు. ఎమ్మెల్యే కాకపోయినా అయిదేళ్ళు అధికారం ఎంజాయ్ చేశారు. 2019 కి ముందు వైసీపీ లోకి జంప్ చేసి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓట్లను జనసేన చీల్చడంతో ఎలమంచిలి ఎమ్మెల్యే అయ్యారని ప్రజల్లో టాక్ వినిపిస్తోంది.

కన్నబాబురాజు స్వభావం తెలిసిన ఎలమంచలి ప్రజల్లో ఎక్కువమంది ఓడిపోతారని భావించారు. కన్నబాబురాజుకి కూడా గెలుస్తానన్న నమ్మకం లేదు. వైసీపీ హవాకు టీడీపీ ఓట్లు బాగా చిలడంతో చావుతప్పినట్టు తక్కువ మెజారిటీతో గెలిచారు. గెలిచిన మొదటిరోజునుంచే తన నోటికి పని చెప్పడం మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాంబిల్లి మండలం లాలం కోడూరులో స్వంత పార్టీ మానిషినే పోటినుంచి తప్పుకోవాలంటూ బెదిరించడం.. పోటినుంచి తప్పుకోకపోతే ఫారెస్ట్ రేంజర్ తో చెప్పి బొక్కలో వెయిస్తానని హెచ్చరించడం.. అప్పట్లో సంచలనంగా మారింది.. అదే సర్పంచ్ ఎన్నికల్లో తాను చెప్పిన వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని గెలిపిస్తే సర్పంచ్ కుర్చీలో కూచొనివ్వనని మీడియా సాక్షిగా బహిరంగ సభలో ఓటర్లని బెదిరించడానికి కూడా వెనుకాడని నైజం కన్నబాబురాజుది.

మునగపాక మండలంలో విద్యార్థి దీవెన తనకు రాలేదన్నందుకు ఎమ్మెల్యే కన్నబాబురాజు అతన్ని కొట్టినoత పని చేశారు. అక్కడితో ఆగని కన్నబాబు వాలంటీర్ పై చెయ్యి చేసుకుని తన యారగెన్స్ బయటపెట్టుకున్నారట. ఇటీవల వైసీపీ నేత పంచకర్ల రమేష్ బాబుపై బూతుల పంచాంగం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పార్టీలో కలకలం రేపింది. అధిష్టానం మొట్టికాయలు వేయడంతో పంచకర్లకు క్షమాపణలు చెప్పినట్లు వైసీపీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే కన్నబాబురాజు యారగెన్స్ ప్రదర్శించడంతో ప్రజల్లో చులకనయ్యారని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు వినికిడి. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతోన్న వ్యతిరేకతకు ఈ తరహా ఎమ్మెల్యేల నోటి దురుసుతో పార్టీ పరువు బజారున పడుతోందని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story