బద్వేల్ వైసీపీలో బావా బామ్మర్దుల బాహాబాహీ

బద్వేల్ వైసీపీలో బావా బామ్మర్దుల బాహాబాహీ

బద్వేల్ లో బావా బామ్మర్దుల సవాళ్లు అధికార వైసీపీలో అలజడి సృష్టిస్తున్నాయా రాబోయే ఎన్నికల్లో బద్వేల్ వైసీపీకి ఎదురీత తప్పదా..ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వ్యతిరేకులంతా ఏం స్కెచ్ వేస్తున్నారు బావతో పొసగని బామ్మర్ది ఫ్యాన్ ను పక్కనపెట్టి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారా లెట్స్ వాచ్

కడప జిల్లా రాజకీయాలకు మూల స్తంభం లాంటి బద్వేల్ ఎస్సీ రిజర్వుడు స్థానమైనా వైసీపీలో హవా అంతా ఎమ్మెల్సీ గోవింద రెడ్డి కుటుంబీకులదే నడుస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారం చేపట్టాక రాజకీయ ఫలాలు, పదవుల పంపిణీలో మొదలైన ఆధిపత్య పోరుతో ఈ కుటుంబం నిట్ట నిలువునా చీలిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ గోవిందరెడ్డికీ, ఆయన స్వయానా సోదరుడైన సత్యనారాయణ రెడ్డికి పదవుల పంపకాల విషయంలో వచ్చిన తేడా చినికి చినికి గాలి వానగా మారినట్లు తెలుస్తోంది. ఇక్కడనుండి ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి కుటుంబంలో మొదలైన రాజకీయ సవాళ్లతో కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయేందుకు దారితీసింది. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డికి వ్యతిరేకంగా సత్యనారాయణ రెడ్డి బావమరిది, కాశి నాయన మండల వైసీపీ కన్వీనర్ విశ్వనాథరెడ్డి ప్రత్యేక రాజకీయ శిబిరం ఏర్పాటు చేసి వేరు కుంపటి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని కాదని తన అనుచరులతో నామినేషన్లు వేయించి కాశినాయన మండల వ్యాప్తంగా గోవిందరెడ్డి నిలబెట్టిన అభ్యర్థులను ఓడించి విశ్వనాధ్ రెడ్డి క్లీన్ స్వీప్ చేశారు. దీంతో డైలమాలోపడ్డ గోవిందరెడ్డి.. విశ్వనాధ్ రెడ్డి అధికారాలకు కత్తెర వేసినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అప్పటినుంచి విశ్వనాథరెడ్డి గోవిందరెడ్డిల మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరినట్లు పబ్లిక్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి విశ్వనాథరెడ్డిని నిలువరించేందుకు వైసీపీ హైకమాండ్ వద్ద పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో వైసీపీ పెద్దలు సర్దుబాటు మంత్రం గోవింద్ రెడ్డిచెవిలో చెప్పినట్లు సమాచారం. దీంతో మరింతగా రగిలిపోయిన గోవిందరెడ్డి, ఆయన వర్గీయులు విశ్వనాథరెడ్డి రాజకీయాలకు కత్తెర వేసే కార్యక్రమాలు చేస్తున్నారట. కాశి నాయన మండలం కలసపాడు పోరుమామిళ్ల బి.కోడూరు మండలాల్లో విశ్వ నాధ రెడ్డికి మంచి పట్టుంది. ఈ మండలాల్లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు విశ్వనాథరెడ్డి అనుచరుల నుంచి గోవింద్ రెడ్డికి నిరసనల సెగ తాకుతోందట. దీంతో దిక్కు తోచని గోవింద్ రెడ్డి హై కమాండ్ అండతో విశ్వనాథరెడ్డికి పొగ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అటు విశ్వనాథరెడ్డి ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూసి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారనే టాక్ నడుస్తోంది.

ముఖ్యంగా కలసపాడు కాశి నాయన మండలాల్లో వైసీపీ గడపగడప కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంట నాయకులు లేక వెలవెలబోతోందట. ఇలా బావ బామ్మర్దుల సవాల్‌తో బద్వేల్ అధికార పార్టీ కునారిల్లుతుంటే.. ఇదే అదనుగా అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం అందిన కాడికి దండుకుంటున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. బద్వేల్ నగరంలో వైసీపీ నేత మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములను, పేద మధ్యతరగతికి చెందిన స్థలాలను భారీ కబ్జాజేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రజలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్న బద్వేల్ ప్రజానీకం అధికార పార్టీ నాయకుల ఆగడాల పై విసుగు చెంది దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో కంచుకోట లాంటి బద్వేల్‌లో అధికార పార్టీ ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోతున్నట్లు నియోజకవర్గ పబ్లిక్‌లో టాక్ నడుస్తోంది.

Read MoreRead Less
Next Story