Editorial: రాయదుర్గం వైసీపీలో రగులుతున్న అసమ్మతి

Editorial: రాయదుర్గం వైసీపీలో రగులుతున్న అసమ్మతి


రాయదుర్గం నియోజకవర్గంలో ఎంఎల్ఏగా, ప్రభుత్వ విప్ గా కాపు రాంచంద్రారెడ్ది ఉన్నారు.ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపుకోసం చెమటోడ్చిన కార్యకర్తలను వదిలేసి ఎవరు డబ్బులిస్తే వారికి అగ్రపీఠం వేస్తున్నారంటూ అసంతృప్త నేతలు ఆరోపిస్తున్నారు. అసంతృప్త నేతలకు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. మూడురోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డి అసమ్మతి నేతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అసమ్మతి నేతల నెత్తిన పాలు పోసినట్లయిందని చర్చ నడుస్తోంది. ఎందుకంత అసంతృప్తి....క్యాండిడేట్లు వీళ్ళే ఉంటారన్న గ్యారంటీ ఏముంది...మెట్టు గోవిందరెడ్డి కూడా క్యాండిడేట్ కావచ్చు కదా అంటూ వ్యాఖ్యానించడంతో అసంతృప్త నేతల్లో ఆనందం కట్టలు తెంచుకున్నట్లు సమాచారం.

ఈ సారి ఎన్నికలు పార్టీకి ముఖ్యమైనవన్న పెద్దిరెడ్డి.. ఏ నాయకుడ్ని వదులుకునేది లేదని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి వర్గం షాక్‌కు గురయినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తనకు అడ్డే లేదనుకొంటున్న కాపు రాంచంద్రారెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి ప్రస్తావన తీసుకురావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మంత్రిపెద్దిరెడ్డి తో సమావేశం తరువాత అసమ్మతి నేతలంతా రాయదుర్గంలో సమావేశమై పార్టీ కార్యక్రమాల్లో ఏవిధంగా వ్యవహరించాలి...మెట్టు గోవిందరెడ్డికి మద్దతుపై కసరత్తు ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంఎల్ఏ కాపు రాంచంద్రారెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి, కణేకల్ జయరాంరెడ్డి లాంటి నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో ఎంఎల్ఏకు వ్యతిరేకంగా చురుగ్గా పాల్గొనేలా ప్లాన్ చేసుకొంటున్నట్లు సమాచారం.

ఓ వైపు ప్రతిపక్ష టీడీపీ వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతుంటే...స్వపక్షంలోని అసమ్మతి నేతలతో రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రాంచంద్రారెడ్డి టెన్షన్ పడుతున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో కీలకమైన ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ అమలుకాకపోవడంపై ఇప్పటికే విపక్షం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్వపక్షంలో నేతలు కూడా కీలకమైన ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారంటూ చేస్తున్న వ్యాఖ్యలు కాపును కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.రాయదుర్గం నియోజకవర్గంలో కీలకమైన కాపు రాంచంద్రారెడ్డిని పక్కన పెట్టేందుకు అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్లు అసమ్మతి నేతలు చేస్తున్న ప్రచారంతో రాయదుర్గం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story