Editorial: రేవంత్ వ్యూహాలు ఓట్లు కురిపిస్తాయా.?

Editorial: రేవంత్ వ్యూహాలు ఓట్లు కురిపిస్తాయా.?


2018 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దు నియోజకవర్గాలైన భద్రాచలం, ఇల్లందు, ములుగు, భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఐదు నియోజకవర్గాలు పూర్తి స్థాయి ఆదివాసీ గిరిజన ప్రాబల్యంతో కూడిన నియోజకవర్గాలు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, భూపాలపల్లి ఎమ్మెల్యే రమణారెడ్డిలు బిఆర్ఎస్‌లోకి వెల్లగా మంథని, భద్రాచలం, ములుగు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వీరి ముగ్గురిని మొదటి నుండి బిఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తునట్లు టాక్ వినిపిస్తోంది. అయినా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కర్ణాటక ఫలితాల నేపధ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపినట్లు టాక్ వినిపస్తోంది.


ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు మావోయిస్టు పార్టీ ప్రభావంతో పాటు గిరిజనుల్లో ప్రభుత్వంపట్ల సహజంగా ఉండే వ్యతిరేకతతో ఈసారి కచ్చితంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలున్నాయని జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు ఇల్లందు, భూపాలపల్లిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంథని మాజీ ఎమ్మెల్యేలు మినహా ములుగు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని బలంగా ఎదుర్కొనే నియోజకవర్గ స్థాయి నేతలు లేకపోవడం బీఆర్ఎస్‌కు బలహీనతగా మారినట్లు పబ్లిక్‌లో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఐదు నియోజకవర్గాలలో పోడు భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు భూపాలపల్లి , ఇల్లందు నియోజకవర్గాలలో తనతో వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు, బిఆర్ఎస్ ఉద్యమకారులు, పార్టీలో మొదటినుండి పనిచేస్తున్నవారిని కాకుండా కాంగ్రెస్ పార్టీనుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే అంశం చర్చానీయాంశంగా మారింది. ఈ ఐదు నియోజకవర్గాలలో సిట్టింగ్‌లు ఇద్దరిని మినహాయిస్తే మూడు నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ నేతలే బలమైన నేతలుగా ఉన్నట్లు పబ్లిక్‌లో టాక్ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story