వైసీపీ అరాచకాలకు బలవుతున్న సామాన్యులు?

వైసీపీ అధిష్ఠానం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో ఆ నియోజకవర్గం దిక్కులేకుండా పోయిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న మూడున్నరేళ్లు నియోజకవర్గ అభివృద్ధికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కృషిచేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అధికార పార్టీ నుండి బయటకు రావడంతో నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు ప్రజలను వేధింపులు, దౌర్జన్యాలలు పెరగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. తను పార్టీలో ఉన్నంతకాలం తోకజాడించని నేతలు .... ఇప్పుడు జూలు విదిలిస్తున్నారట. వైసీపీ నుండి బయటకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కలచివేస్తున్నాయని సన్నిహితుల దగ్గర ఆవేదన చెందుతున్నారు.
గతంలో పెన్నానది నుండి అధికార పార్టీ నేతలు ఇసుక తరలిస్తుంటే అడ్డుకున్న శ్రీధర్ రెడ్డి...పార్టీ నుండి సస్పెండయ్యాక చేతులు కట్టేసినట్టు ఉందని ఆవేదన చెందుతున్నారు. పెన్నానదినుండి భారీ ఎత్తున ఇసుక తరలిస్తుంటే రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయట. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అక్కచెరువుపాడు జగనన్న లేఅవుట్ సమీప ప్రాంతంలో టిప్పర్లతో గ్రావెల్ ను ఇష్ట రాజ్యంగా తరలిస్తున్నారని పట్టించుకునే నాధుడే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ ను తరలించడానికి ఉన్న అనుమతుల గురించి స్థానికులు అడుగుతున్నా.. వాటిని పట్టించుకోకుండా రాత్రి వేళల్లో కూడా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోరంబోకు భూముల్లో 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సన్నకారు రైతుల పొట్ట కొట్టి 10 అడుగుల లోతు తవ్వేశారని జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రూరల్ నియోజకవర్గం శ్రీధర్ రెడ్డి ఆధీనంలో ఉన్నన్ని రోజులు ధైర్యంగా ఉన్న మహిళలు.. ఇప్పుడు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారట. స్వయంగా అధికార పార్టీ నేతలే మహిళలను అవమానిస్తున్నారని ఫిర్యాదు చేయబోతే సదరు నేత బెదిరించారని బాధితురాలు వాపోతున్నారు. నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా డివిజన్లకు నిధులు కేటాయింపులు చేసి అభివ్రుద్దికి శ్రీధర్ రెడ్డి కృషి చేశారు. అయితే తమ డివిజన్లలో అభివృద్ధి అవసరం లేదు కేటాయించిన నిధులు రద్దు చేయాలని కార్ర్పొరేటర్లు డిమాండ్ చేస్తుండటంతో ఇదెక్కడి చోద్యమంటూ నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్న ముందు కార్పోరేటర్‌కి కప్పం కట్టాలనే నిబంధనను తెరమీదకు తీసుకొచ్చారట అధికార పార్టీ నేతలు. ఒక వైపు నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు ఆగడాలు మితిమీరిపోయాయని శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతల దురాగతాలకు విసిగిపోయిన ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెబుతామంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com