MOTHERS DAY: ప్రేమకు ప్రతిరూపం అమ్మ

ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా మాతృమూర్తితో ఉన్న అనుబంధం గొప్పది. అందుకే ఆమె రోజంతా ఎన్ని బాధ్యతలు నిర్వహించినా ఎక్కువ భాగం ఇంటికే ప్రాధాన్యం ఇచ్చి తన కుటుంబ అవసరాలను తీర్చటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నీవు ఎంత కాదనుకున్నా జీవితాంతం నీకు తోడుగా నిలిచేది అమ్మ ప్రేమ ఒక్కటే. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున అమ్మకు మనసారా శుభాకాంక్షలు తెలుపుదాం. సృష్టిలో కమ్మనైన పదం అమ్మ. బిడ్డను తన గర్భంలో నవమాసాలు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బిడ్డకు జన్మనిచ్చి.. ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తన పిల్లల భవిష్యత్ కోసం, వారి ఎదుగల కోసం అమ్మ చేసే త్యాగాలు అనంతరం. ఇంట్లో నలుగురు ఉండి.. ముగ్గురికి మాత్రమే సరిపడే ఆహారం ఉంటె.. తాను తిన్నాను అంటూ.. కుటుంబ సభ్యుల కడుపునింపేదే అమ్మ. ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ.. అటువంటి అమ్మని స్మరించుకుంటూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఒక్కోరోజు మాతృదినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం నాడు ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ప్రపంచ మాతృ దినోత్సవాన్ని మే 11న జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున మీ ప్రియమైన తల్లికి బహుమతులు ఇవ్వడం ద్వారా, ఆమెకు ఇష్టమైన వంటకాలను తినిపించడం ద్వారా , ఆమెను విహారయాత్రకు తీసుకెళ్లడం ద్వారా ఈ మదర్స్ డేను ప్రత్యేకంగా జరుపుకోండి.
తల్లీబిడ్డలది పేగు బంధం. అందుకే పుట్టినప్పటి నుంచి బిడ్డ ఆకలి, నొప్పి, బాధ.. అన్నీ చెప్పకుండానే అమ్మకు తెలుస్తాయి. అప్పటిదాకా ఆమె అమ్మాయిగా ఆమెకి ఎన్నో ఆలోచనలు ఉన్నా, అమ్మ అయ్యాక తన ఆలోచనంతా బిడ్డల మీదే. పిల్లలు ఏదైనా సాధిస్తే, అది తన గెలుపు అన్నట్టే మురిసిపోతుంది. పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా, ఇంటి నుంచి బయటికెళ్తే తిరిగి వచ్చేదాకా కళ్లార్పకుండా వాళ్లకోసం ఎదురు చూస్తుంది. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, ఈసారి మళ్లీ రాసి పాసవుతాడంటూ వెనకేసుకొస్తుంది. చిన్నప్పుడు లాలిస్తూ, బుజ్జగిస్తూ, కథలు చెప్పే అమ్మ.. పెద్దయ్యాక ఫ్రెండ్‌లా, మెంటార్‌లా పక్కనే ఉండి సపోర్ట్ చేస్తుంటుంది. అమ్మకి తెలుసు.. మనం అనుకున్నది సాధించలేకపోతే, ఎంత బాధ పడతామో అని. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గొప్పతనం హిమాలయాల కంటే ఎత్తైనది. అమ్మ రుణాన్ని తీర్చుకోవడం ఈ సృష్టిలో ఏ బిడ్డకూ సాధ్యం కాదు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా అమ్మను సంతోష పెట్టడం నేర్చుకోవాలి.
తల్లులను గౌరవించుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. మీ తల్లుల ప్రేమ , త్యాగాలకు గౌరవించటానికి , కృతజ్ఞతలు చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మీ తల్లితో మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కూడా అందిస్తుంది. అందువలన, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో మదర్స్ డేను జరుపుకుంటారు. కొంతమంది ఈ రోజున తమ తల్లులకు ఇంటి పనుల నుండి విరామం ఇచ్చి, వారిని ప్రయాణాలు , విహారయాత్రలకు తీసుకెళ్తే, మరికొందరు తమ తల్లులకు ఇష్టమైన బహుమతిని ఇవ్వడం ద్వారా ఈ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. మొత్తం మీద, మీ తల్లి ప్రేమ , త్యాగానికి ఆమెను గౌరవించడానికి , కృతజ్ఞతలు చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
