REOUBLIC DAY: ప్రజాస్వామ్య హృదయం.. మన రాజ్యాంగం

REOUBLIC DAY: ప్రజాస్వామ్య హృదయం.. మన రాజ్యాంగం
X
భారత ప్ర­జా­స్వా­మ్య వ్య­వ­స్థ­కు ప్రా­ణ­ప్ర­తి­ష్ఠ చే­సిన పవి­త్ర గ్రం­థం భారత రా­జ్యాం­గం

భారత ప్ర­జా­స్వా­మ్య వ్య­వ­స్థ­కు ప్రా­ణ­ప్ర­తి­ష్ఠ చే­సిన పవి­త్ర గ్రం­థం భారత రా­జ్యాం­గం. ప్ర­పం­చం­లో­ని అతి పె­ద్ద ప్ర­జా­స్వా­మ్య దే­శం­గా భా­ర­త­దే­శా­న్ని ని­ల­బె­ట్టిన ఈ రా­జ్యాం­గం కే­వ­లం చట్టాల సం­క­ల­నం మా­త్ర­మే కాదు… కో­ట్లా­ది మంది ఆశలు, ఆకాం­క్ష­లు, హక్కు­లు, బా­ధ్య­త­ల­కు ప్ర­తి­బిం­బం. భా­ర­త­దే­శా­ని­కి స్వా­తం­త్ర్యం వచ్చిన 1947 ఆగ­స్టు 15వ తేదీ దేశ చరి­త్ర­లో ఎంత ము­ఖ్య­మో, రా­జ్యాం­గం అమ­ల్లో­కి వచ్చిన 1950 జన­వ­రి 26వ తేదీ కూడా అంతే ప్రా­ధా­న్యత కలి­గి ఉంది. అం­దు­కే ప్ర­తి సం­వ­త్స­రం జన­వ­రి 26న గణ­తం­త్ర ది­నో­త్స­వా­న్ని ఘనం­గా జరు­పు­కుం­టు­న్నాం. అయి­తే చాలా మం­ది­కి తె­లి­య­ని ఒక ము­ఖ్య­మైన అంశం ఏమి­టం­టే, భారత రా­జ్యాం­గా­ని­కి అధి­కా­రిక ఆమో­దం లభిం­చిం­ది మా­త్రం గణ­తం­త్ర ది­నో­త్స­వా­ని­కి రెం­డు నెలల ముం­దే. 1949 నవం­బ­ర్ 26న రా­జ్యాంగ సభ భారత రా­జ్యాం­గా­న్ని ఆమో­దిం­చిం­ది. అయి­న­ప్ప­టి­కీ, చాలా సం­వ­త్స­రాల పాటు ఈ రో­జు­ను ప్ర­త్యే­కం­గా గు­ర్తిం­చ­లే­దు. దా­దా­పు ఆరు దశా­బ్దాల తర్వాత, రా­జ్యాంగ ప్రా­ము­ఖ్య­త­ను ప్ర­జ­ల్లో మరిం­త­గా చా­టి­చె­ప్పే ఉద్దే­శం­తో భారత ప్ర­భు­త్వం 2015లో ఒక కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది.

దేశ స్వా­తం­త్య్రం కోసం వే­లా­ది మంది ప్ర­జ­లు తమ ధన మాన ప్రా­ణ­త్యా­గా­లు చే­శా­రు. ఇక, అహింస అనే ఆయు­ధం­తో భా­ర­తీ­యు­ల­ను ఒక్క­తా­టి­పై­కి తీ­సు­కొ­చ్చిన గాం­ధీ.. జా­తీయ ఉద్య­మా­న్ని కొ­త్త పుం­త­లు తొ­క్కిం­చా­రు. అయి­తే, 1947 ఆగ­స్టు 15న స్వా­తం­త్ర వచ్చి­నా 1950వ దశ­కం­లో­నే దే­శా­ని­కి సం­పూ­ర్ణ స్వ­రా­జ్యం సి­ద్ధిం­చిం­ది. స్వా­తం­త్రం తర్వాత గణ­తం­త్ర దే­శం­గా 1950 జన­వ­రి 26న భా­ర­త్ అవ­త­రిం­చిం­ది. అదే రి­ప­బ్లి­క్ డే.. అయి­తే, దీని ప్రా­ము­ఖ్యత తె­లి­య­ని జనా­ని­కి ఇదొక సా­ధా­రణ సె­ల­వు రోజు. సర­దా­గా ఇంటి పట్టున ఉంటూ సి­ని­మా­లు, షి­కా­ర్లు, షా­పిం­గ్‌­ల­తో­నూ కా­ల­క్షే­పం చే­స్తా­రు. కానీ, దేశ స్వా­తం­త్రం కోసం ఎన్నో త్యా­గా­లు చేసి తమ ప్రా­ణా­ల­నే తృ­ణ­ప్రా­యం­గా భా­విం­చి, స్వ­రా­జ్య యజ్ఞం­లో సమి­ధ­లైన గొ­ప్ప వ్య­క్తు­ల­ను ఈ రోజు ఎంత మంది స్మ­రి­స్తు­న్నా­రు? జా­తీయ సె­ల­వు రో­జున ఎంత మంది వారి ఆద­ర్శా­ల­ను వల్లిం­చు­కుం­టు­న్నా­రు? దేశ స్వా­తం­త్రం మీద నేటి యు­వ­త­కి ఎంత అవ­గా­హన ఉంది? అన్న అం­శా­ల­పై ఎవ­రై­నా సర్వే ని­ర్వ­హి­స్తే సి­గ్గు­తో తల­దిం­చు­కు­నే వి­ష­యా­లు బయ­ట­ప­డ­తా­యి. భారత రా­జ్యాం­గం రూ­పు­ది­ద్దు­కు­న్న తీరు కూడా అంతే వి­శి­ష్ట­మై­న­ది. ఈ రా­జ్యాం­గా­న్ని ము­ద్రణ యం­త్రా­ల­తో కా­కుం­డా, పూ­ర్తి­గా చే­తి­రా­త­తో రూ­పొం­దిం­చా­రు. ఈ అపూ­ర్వ­మైన బా­ధ్య­త­ను ప్రే­మ్ బి­హా­రీ నా­రా­య­ణ్ రా­య్‌­జా­దా అనే గొ­ప్ప కా­లి­గ్రా­ఫ­ర్ ని­ర్వ­ర్తిం­చా­రు.

భారత రా­జ్యాం­గం ఎంత వి­శా­ల­మైం­దో దాని పరి­మా­ణ­మే చె­బు­తుం­ది. ప్ర­పం­చం­లో ప్ర­స్తు­తం అమ­ల్లో ఉన్న అతి చి­న్న రా­జ్యాం­గం అమె­రి­కా రా­జ్యాం­గం కాగా, అతి పె­ద్ద రా­జ్యాం­గం భారత రా­జ్యాం­గ­మే. దే­శం­లో­ని భా­ష­లు, మతా­లు, కు­లా­లు, వర్గా­లు, ప్రాం­తాల మధ్య సమ­తు­ల్యత సా­ధిం­చా­ల­నే లక్ష్యం­తో వి­స్తృ­తం­గా రూ­పొం­దిం­చి­నం­దు­వ­ల్లే ఇది ఇంత వి­స్తా­రం­గా రూ­పు­ది­ద్దు­కుం­ది. భారత రా­జ్యాం­గం­పై ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా ఉన్న మే­ధా­వు­లు అనేక ప్ర­శం­స­లు కు­రి­పిం­చా­రు. హె­చ్‌­వీ కా­మ­త్ భారత రా­జ్యాం­గా­న్ని దే­వేం­ద్రు­ని ఐరా­వ­తం­తో పో­ల్చు­తూ, అది బల­మై­న­ద­ని, వి­శా­ల­మై­న­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­డు. ప్ర­ముఖ రా­జ్యాంగ పం­డి­తు­డు గ్రా­న్ వి­ల్లే ఆస్టి­న్ భారత రా­జ్యాం­గా­న్ని “అం­ద­మైన అతు­కుల బొంత”గా అభి­వ­ర్ణిం­చా­డు. అంటే, ప్ర­పం­చం­లో­ని వి­విధ రా­జ్యాం­గాల నుం­చి మంచి అం­శా­ల­ను తీ­సు­కు­ని, భా­ర­త­దేశ పరి­స్థి­తు­ల­కు అను­గు­ణం­గా మల­చిన గొ­ప్ప కృ­షి­గా ఆయన భా­విం­చా­డు.

Tags

Next Story