Editorial: అంబర్ పేట BRSలో టికెట్ ఫైట్

Editorial: అంబర్ పేట BRSలో టికెట్ ఫైట్
అంబర్ పేట నియోజకవర్గ బీఆర్ఎస్‌లో వర్గ పోరు తారస్థాయికి చేరిందా? సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఐక్యతారాగం ఆలపిస్తున్నారా? ఈసారి కూడా గులాబీ జండా ఎగురవేసేందుకు ఆ పార్టీ నేతలు తహతహలాడుతున్నారా? మాలో ఎవరికైనా టికెట్ ఇవ్వండి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మాత్రం టికెట్ ఇవ్వొద్దంటున్నారా? ఎమ్మెల్యే ను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారా? అసలు అంబర్ పేట బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

అంబర్ పేట నియోజకవర్గ బీఆర్ఎస్‌లో వర్గ పోరు తారస్థాయికి చేరిందా? సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఐక్యతారాగం ఆలపిస్తున్నారా? ఈసారి కూడా గులాబీ జండా ఎగురవేసేందుకు ఆ పార్టీ నేతలు తహతహలాడుతున్నారా? మాలో ఎవరికైనా టికెట్ ఇవ్వండి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మాత్రం టికెట్ ఇవ్వొద్దంటున్నారా? ఎమ్మెల్యే ను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారా? అసలు అంబర్ పేట బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు టికెట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజలకు చేరువవుతూ సిట్టింగ్‌లను టెన్షన్ పెడుతున్నారు. ప్రధానంగా అధికార బీఆర్ఎస్‌లో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ పరిథిలో 2009లో ఏర్పాటయిన అంబర్ పేట నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉండేది. అంబర్ పేట లో BJP అభ్యర్థి కిషన్ రెడ్డి 2009 , 2014లో రెండు సార్లు విజయం సాధించారు. 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కిషన్ రెడ్డి పై BRSనుండి పోటీ చేసిన కాలేరు వెంకటేష్ వెయ్యి పదహారు ఓట్లతో గెలిచారు. అయితే తాజాగా అంబర్ పేట నియోజకవర్గం బీఆర్ఎస్‌ వర్గ పోరుతో సతమతం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఒంటెత్తు పోకడలతో విసిగిపోయామంటూ బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. ఉద్యమకారులను, పార్టీ సీనియర్ నాయకులను కాలేరు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. దీంతో ఎమ్మల్యే కాలేరు వెంకటేష్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అసమ్మతి నేతలంతా ఏకమయినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాలేరుకు కాకుండా మాలో ఎవరికైనా టికెట్ ఇవ్వండి అని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పట్టు పడుతున్నట్లు సమాచారం. వర్గ పోరు తారస్థాయిలో ఉన్న అంబర్ పేటలో సిట్టింగ్‌కే టికెట్ ఇస్తే..... అధికార పార్టీకి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నియోజకవర్గ పబ్లిక్‌లో టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంలో కీలకంగా ఉన్న బాగ్ అంబర్ పేట మాజీ కార్పొరేటర్ పద్మావతి DP రెడ్డి ....ఈ సారి మహిళల కోటాలో అంబర్ పేట బీఆర్ఎస్ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి 2020 వరకు బాగ్ అంబర్ పేట కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో నియోజకవర్గ సమస్యలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ సమస్యలను GHMC కౌన్సిల్‌లో గళమెత్తి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్కింగ్ ఫీజుల వసూలుపై అలుపెరగని పోరాటం చేశారు. అంతే కాకుండా కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి కల్తీ ఆహారం నుంచి నగరవాసులను కాపాడేందుకు పద్మావతి DP రెడ్డి కృషి చేశారు. చిన్నపాటి వరదలకే నగరం తటాకాన్ని తలపిస్తుండటంతో వరద ముంపు సమస్య తీర్చాలని పోరాటం చేశారు.

పలు ఎన్జీవోలను నడిపిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు పద్మావతి DP రెడ్డి. లయన్స్ క్లబ్ ఆఫ్ హుడాన్ హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా ఉన్న పద్మావతి డీపీ రెడ్డి సయోధ్య అనే NGOను రన్ చేస్తున్నారు. వుమెన్ ఫర్ వెల్ నెస్ అనే స్వచ్చంద సంస్థను స్థాపించి ఎంతో మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. 2018లోనే అంబర్ పేట బీఆర్ఎస్ టికెట్ ఆశించినా రాజకీయ సమీకరణల నేపథ్యంలో టికెట్ దక్కలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. కరోనా సమయంలో పేదలను ఆదుకున్న పద్మావతి DP రెడ్డి....అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటున్న తనకే ఈ సారి అంబర్ పేట టికెట్ వస్తుందని పద్మావతి డీపీ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

2020లో కార్పొరేటర్‌గా ఓడినా అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ....పేదలకు అండగా నిలుస్తున్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేని విద్యావంతురాలైన తనకే అంబర్ పేట BRS టికెట్ అంటున్నారు పద్మావతి DP రెడ్డి. మరో వైపు ఎవరెన్ని గ్రూపులు కట్టినా అంబర్ పేటలో మళ్ళీ నాకే టికెట్ అంటున్నారు కాలేరు వెంకటేష్.

Tags

Read MoreRead Less
Next Story