Editorial: అంతర్మథనంలో బీఆర్ఎస్ ఆశావహులు

Editorial: అంతర్మథనంలో బీఆర్ఎస్ ఆశావహులు
బీఆర్ఎస్ తొలి జాబితా రిలీజ్ కానుందా తొలిజాబితాలో సిట్టింగ్ లకు టిక్కెట్ దక్కేనా ? టికెట్ రాకపోతే అసమ్మతి నేతలు ఏం చేయబోతున్నారు? అధిష్ఠానాన్ని ధిక్కరిస్తారా పక్క చూపులు చూస్తున్నారా? ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అశావహులు బిజీగా ఉన్నారా?

తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు విడతలుగా అభ్యర్థుల జాబితా ప్రకటించనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ ప్రకటించే తొలి జాబితా పైనే అందరి దృష్టి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ లిస్ట్ లో ఎంత మంది ఉన్నారు... ఎవరెవరు పేర్లు ఉన్నాయి... ఇందులో సిట్టింగ్ లు ఎంత మంది ఉన్నారన్న దానిపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తొలి జాబితాలో లేకపోతే తమ పని అయిపోయినట్టేనా ... ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాల్సిందేనా.. చివరి జాబితాలో కూడా అవకాశం దక్కకపోతే తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనన్న బెంగతో పలువురు నేతలకు కంటి మీద కునుకులేకుండా పోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అభ్యర్థుల జాబితా పై కేసీఆర్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. చిన్న లీక్ కూడా ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పడు చర్చకు ఆస్కారం లేకుండా జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసిన రెండు గంటల్లో 105మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సిట్టింగులకే పూర్తి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రత్యర్థి ఊహించని ఎత్తులతో జాబితా విడుదలకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సొంత సర్వేలతో పాటు ప్రవేట్ సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు జోరుగా ప్రచారవం జరుగుతోంది.

జాబితా ఎంపికలో సీఎం కేసీఆర్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుమారు 20మంది సిట్టింగులకి టికెట్ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. 40నుంచి 50మంది నేతల సర్వే రిపోర్ట్‌లు పూర్ గా ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో ఆయా నేతలకు నిద్రపోనియ్యాటం లేదట. ఈ క్రమంలో జాబితా రిలీజయిన తరువాత పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని నన్న అంతర్మథనంలో పలువురు ఆశావహులు ఉన్నట్లు సమాచారం. అయితే టిక్కెట్ డౌట్ ఉన్న నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌లో టికెట్ రాకపోతే కాంగ్రెస్, బీజేపీలో చేరి బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఆయా పార్టీల ముఖ్యనేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తొలి జాబితా విడుదల చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని అటు కేసీఆర్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే ప్రాధాన్యత నిస్తామని కేసీఆర్ ప్రకటించినా సర్వేల ఆధారంగా జాబితా సిద్ధం చేస్తుండటంతో పలువురు సిట్టింగులు కూడా టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది సిట్టింగులు టికెట్ గ్యారంటీ లేదన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంఇ. అంతర్గత విభేదాలతో దాదాపు అన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, అసమ్మతి నేతలు రగిలిపోతున్నట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు సిట్టింగులకు టికెట్ ఇవ్వకపోతే ఆ టిక్కెట్ దక్కించుకునేందుకు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

తొలి జాబితా ప్రకటన అనంతరం బీఆర్ఎస్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయని సీనియర్ నేతలు అంచనావేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఓ వైపు టిక్కెట్ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తూనే మరోవైపు టికెట్ రాకపోతే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story