రాబోయే ఎన్నికల్లో గులాబీ వ్యూహం..?

రాబోయే ఎన్నికల్లో గులాబీ వ్యూహం..?
రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై BRS కసరత్తు ముమ్మరం చేసిందా? అసమ్మతి నేతలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు? విపక్షాలను ఎదుర్కొనేందుకు KCR వ్యూహం మార్చారా? హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న KCR ఎలాంటి వ్యూహంతో ఎన్నికలకు వెళ్లనున్నారు?

రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై BRS కసరత్తు ముమ్మరం చేసిందా? అసమ్మతి నేతలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు? విపక్షాలను ఎదుర్కొనేందుకు KCR వ్యూహం మార్చారా? హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న KCR ఎలాంటి వ్యూహంతో ఎన్నికలకు వెళ్లనున్నారు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమం చేసిన పార్టీని గెలిపించండి అంటూ గులాబీ పార్టీ ప్రజల ముందుకెళ్ళింది. దీంతో గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజానీకం పట్టం కట్టారు. ఇక రెండోసారి ఎన్నికలకు వెళ్లిన సమయంలో కొత్త రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలంటే తమకు మరొకసారి అవకాశం ఇవ్వాలని KCR ప్రజలను కోరారు. అలా రెండోసారి కూడా గులాబీ పార్టీని ప్రజలు ఆదరించి అధికార పీఠం ఎక్కించారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. విపక్షాలు స్పీడ్ పెంచడంతో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. అధికార BRSను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, BJPలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నాయి. రెండు దఫాలుగా అధికారం చేపట్టిన గులాబీ పార్టీని విపక్షాలు ప్రజల ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాయి. సభలు, సమావేశాలు, పాదయాత్రలతో అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఇక విపక్షాల ఒత్తిడికి తోడు సొంత పార్టీలో అసంతృప్తి సెగలు గులాబీ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బరిలో దిగనున్న అభ్యర్థులపై BRS కసరత్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా కారణంతో సిటింగ్‌ అభ్యర్థులను మార్చాల్సి వస్తే అక్కడ ప్రత్యామ్నాయం ఎవరనే విషయంపై కూడా అధిష్ఠానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీకి ఉన్న పట్టు, ప్రత్యర్థుల బలహీనతలను బేరీజు వేసుకుని గెలిచే అవకాశమున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా.. వారికే టికెట్లు ఇస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ప్రత్యర్థి బలంగా ఉండి, ప్రస్తుత MLA గెలిచే అవకాశం లేనిచోట మాత్రమే అభ్యర్థిని కచ్చితంగా మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పలు సర్వేల ద్వారా CM KCR దాదాపు అన్ని నియోజకవర్గాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కానీ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చే వరకు KCR వేచి చూసే ధోరణి అవలంభిస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఒక్కో నియోజకవర్గంలో టికెట్ కోసం పోటీపడుతున్న ఆశావహులు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు కూడా దక్కని అసంతృప్త నేతలు అధిష్టానం పై గుర్రుగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మూడోసారి ఎన్నికలకు వెళ్లే క్రమంలో టికెట్లు దక్కకపోతే ఎవరికి వారు సొంత పార్టీకి ఎసరు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పది జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గులాబీ బాస్ వచ్చే ఎన్నికల్లో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మూడోసారి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరనున్నది గులాబీ పార్టీ. విపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సొంత పార్టీలోని అసంతృప్త నేతలకూ చెక్ పెడతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో పలు అంశాలపై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు అభ్యర్థిని కాదు ప్రభుత్వ పనితీరును చూసి ఓటెయ్యండి అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు KCR రెడీ అవుతున్నట్లు సమాచారుం.

Tags

Read MoreRead Less
Next Story