బాబోయ్..పాదయాత్రలా...! అంటున్న నేతలు

బాబోయ్..పాదయాత్రలా...! అంటున్న నేతలు
ఆ జిల్లాలోని కాంగ్రెస్‍ నేతలు పాదయాత్రలు అంటేనే హడలిపోతున్నారా? పాదయాత్రల నిర్వహణ బాధ్యతలు మోయలేక అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారా? ఆ జిల్లాలో ఓ వెలుగువెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోయిందా? నేతల మధ్య సమన్వయం లేమితో పార్టీ చితికిలపడుతుందా..? ఇంతకీ పాదయాత్ర అంటే ఏ జిల్లా నేతలు భయపడుతున్నారు?

ఆ జిల్లాలోని కాంగ్రెస్‍ నేతలు పాదయాత్రలు అంటేనే హడలిపోతున్నారా? పాదయాత్రల నిర్వహణ బాధ్యతలు మోయలేక అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారా? ఆ జిల్లాలో ఓ వెలుగువెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోయిందా? నేతల మధ్య సమన్వయం లేమితో పార్టీ చితికిలపడుతుందా..? ఇంతకీ పాదయాత్ర అంటే ఏ జిల్లా నేతలు భయపడుతున్నారు?

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ స్దానాల్లో 5 స్దానాల్లో కాంగ్రె్ పార్టీ అభ్యర్దులు విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం కొల్లాపూర్ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. తర్వాత జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టే తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. సాధారణ ఎన్నికల తర్వాత కొల్లాపూర్ నుంచి గెలిచిన ఒక్కగానొక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి కూడా బీఆర్ఎస్‌ గూటికి చేరడంతో కాంగ్రెస్‌కు జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

కాంగ్రెస్‌కు పెద్ది దిక్కుగా ఉన్న మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ దయనీయంగా మారింది. అయినప్పటికీ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర స్తాయి, జాతీయ స్థాయిలో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శులుగా డాక్టర్ చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు ఉన్నారు. పార్టీ అధ్యక్ష పదవిలోనూ జిల్లాకే చెందిన రేవంత్‌రెడ్డి ఉన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడిగా మల్లురవి, సీనియర్ రాజకీయ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి, మాజీమంత్రి సమరసింహ్మరెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇంత మంది నేతలు జిల్లాలో ఉన్నా పార్టీ క్యాడర్‌కు భరోసా కల్పించటంలో పాటు ప్రజలను పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నాలు జరగడంలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్త మవుతున్నాయి. కేవలం పదవుల కోసం పాకులాడటం తప్పా పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సవాలక్ష సమస్యలతో నేతలు సమమతమవుతుంటే కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీ క్యాడర్‌కు ఇబ్బందికరంగా మారినట్లు టాక్ వినిపిస్తోంది.

దేవరకద్ర నియోజకవర్గంలో మహబూబ్‍ నగర్‍ జిల్లా పార్టీ అధ్యక్షుడు మధుసూధన్‌ రెడ్డి, ప్రదీప్‌కుమార్ గౌడ్ ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‍, పారిశ్రామిక వేత్త అనిరుద్‍ రెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతూ వస్తుంది. కొడంగల్‌లో ఓటమి పాలవడంతో రేవంత్‌రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోవటంలేదన్న భావన పార్టీ క్యాడర్‍ లో వినిపిస్తోంది. ఇక గద్వాలలో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరటంతో ఆ నియోజకవర్గంలో పార్టీ దిక్కులేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. చెప్పుకునేందుకు జాతీయ, రాష్ట్ర స్దాయి నేతలు జిల్లాకు చెందిన వారు ఉన్నా... జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు మాత్రం ముందుకురావటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం హైదరాబాద్‌లో కూర్చోని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప క్షేత్రస్దాయిలో ప్రజాసమస్యలపై దృష్టి పెట్టి వారి పక్షాన పోరాడి జనాల మద్దతు కూడ గట్టలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన రాహుల్‍ గాంధీ భారత్‍ జోడో యాత్రలో కనిపించిన వర్గపోరు... ఇప్పుడు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలోను కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. భట్టి పాదయాత్ర ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి రోజూ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతుందన్న టాక్‍ వినిపిస్తోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల తీరుపై భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అలంపూర్‍ జోగులాంబ ఆలయం నుండి త్వరలో రేవంత్‍ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో ఆయా ప్రాంత నాయకులు ఈ పాదయాత్రలు మా ప్రాణాల మీదకు వచ్చాయంటూ ఆందోళన చెందుతున్నట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. ఐతే ఉమ్మడి జిల్లాలో కొనసాగిన రాహుల్‍ గాంధీ పాద యాత్ర నుండి ఎలాగో గట్టేక్కామని సంబురపడ్డ జిల్లా నేతలు త్వరలో కొనసాగనున్న రేవంత్‍ పాదయాత్రల నిర్వాహణ తమకు తలకు మించిన భారమౌతుందన్న భావనలో ఉన్నట్లు సమాచారం. ఐతే పార్టీ టిక్కెట్టు దక్కుతుందో లేదో తెలియకుండా ఎలా ఖర్చు చెయ్యాలి అన్న సందిగ్ధంలో ఉన్న నేతలు తమకెందుకులే అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పటికైనా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్‍ నేతల తీరు మారుతుందో లేదోనన్న చర్చ సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story