Guduru YSRCP: గూడూరులో విరిగిపోతున్న ఫ్యాన్ రెక్కలు

Guduru YSRCP: గూడూరులో విరిగిపోతున్న ఫ్యాన్ రెక్కలు
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ ఆధిపత్య పోరుతో కొట్టుమిట్టాడుతోంది


గూడురు నియోజకవర్గంలో ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయా?
మూడు వర్గాలు.. ఆరు కూటములుగా గూడూరు వైసీపి చీలిపోయిందా?..
గూడురు వైసీపి ఆగడాలు, అరాచకాల పై ప్రజలు విసిగిపోయారా?
రాబోయే ఎన్నికల్లో సైకిల్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారా?

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ ఆధిపత్య పోరుతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో వర్గపోరు పతాక స్థాయికి చేరగా తాజాగా గుడూరు నియోజకవర్గ వైసీపీ వర్గపోరుతో సతమతం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీ మూడు వర్గాలు, ఆరు కూటములుగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సహజ సంపదల నిలయంగా ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని వర్గపోరుతో ఎవరికి వారు విభజించి పాలించుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు చేస్తున్న సిలికా మైనింగ్, ఇసుక, గ్రావెల్ అక్రమ దందాలతో ప్రజలు విసిగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపి నాయకులంటేనే ప్రజలు చిదరించుకునే పరిస్థితి తయారైందని సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014 నుండి 2019 వరకు సాగిన తెలుగు దేశం పాలన స్వర్ణయుగమని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. వైసీపీ అక్రమ దందాలను ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు చేస్తుండటంతో కర్రు కాల్చి వాత పెట్టేందుకు అదును కోసం గూడూరు ప్రజలు ఎదురుచూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు నల్లేరు పై నడకేనని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలు కావడంతో గూడూరు బరిలో దిగే వైసీపీ అభ్యర్థి కోసం ఆధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు క్షేత్ర స్థాయిలో ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఒక నియోజకవర్గంలోనే అరడజను మంది అభ్యర్దులు కుమ్ములాడుకుంటుంటే పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో, ఎవరికి జై కొట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అసలు వైసీపి ఎమ్మేల్యే, ఎమ్మేల్సీలు, ఎంపీ, జిల్లా అధ్యక్షుల నుండి వచ్చే ఫోన్లకే భయపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ సెకండ్ క్యాడర్ నాయకత్వం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన విషయం మరో వర్గానికి తెలిస్తే తమ మెడ మీద కత్తి వేలాడతుందని హడలిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

గూడూరు నియోజకవర్గం మొదట నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండకడుతూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం చైతన్య రథయాత్ర వంటి పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయడంతో టీడీపీ క్యాడర్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. దీంతో గూడూరు తెలుగు దేశం అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే నని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటీవల చంద్రబాబుతో జరిగిన సమావేశంలొ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కే టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. పాశం సునీల్ కు టికెట్ కన్ఫమ్ కావడంతో టీడీపీ అభ్యర్థి మెజార్టీ పైనే దృష్టి సారిస్తున్నారు.

గతంలో వైసీపికి వచ్చిన మెజార్టీ కంటే రాబోయో ఎన్నికల్లో మరింత మెజార్టీ తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతో టీడీపీ నేతలు మమేకమవుతో వారికి భరోసా కల్పిస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయిందని అటు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story