ఎంపీ అవినాష్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

ఎంపీ అవినాష్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి దగ్గర హై టెన్షన్‌ నెలకొంది.ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్ తప్పదన్న

కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి దగ్గర హై టెన్షన్‌ నెలకొంది.ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్ తప్పదన్న ఊహాగానాల నేపధ్యంలో విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్నారు సీబీఐ అధికారులు. అయితే ఆసుపత్రి ప్రధాన గేటుకి తాళం వేసి కాపల కాస్తున్నారు అవినాష్ వర్గీయులు.ఆసుపత్రి పరిసరాల్లో భారీగా మోహరించారు పోలీసులు. మరోవైపు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అవినాష్ అనుచరులు కెమెరాలు,సెల్ ఫోన్లు లాక్కుని దౌర్జన్యం చేయడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు మీడియా ప్రతినిధులు. అయితే అక్కడే ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు.

అవినాష్‌ అరెస్ట్ తప్పదన్న వార్తల నేపధ్యంలో ఆసుపత్రి దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇక ఈనెల 19న తల్లి శ్రీలక్ష్మికి అనారోగ్యం కారణంగా కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉంటున్నాడు అవినాష్ రెడ్డి.

మరోవైపు ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐ చెప్పినప్పటికీ.. విచారణకు రావడం కుదరదని తన తల్లి డిశ్చార్జ్‌ అయ్యాకే విచారణకు వస్తానని అవినాష్ రెడ్డి లేఖ రాశారు. అయితే అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ అధికారులు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఉత్కంఠ రేపుతుంది.

Live Updates

  • 22 May 2023 5:27 AM GMT

    అవినాష్‌ విచారణ పై ఢిల్లీ వర్గాలు నజర్‌

    అవినాష్‌ విచారణ పై ఢిల్లీ వర్గాలు నజర్‌ పెట్టినట్లు సమాచారం. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఢిల్లీ చేరవేస్తున్నారు. పరిణామాలపై సీబీఐ హెడ్‌ క్వార్టర్‌ సీరియస్‌ గా ఉన్నట్లు సీబీఐ వర్గాలు అంటున్నాయి. ప్రాధాన్యత ఉన్న కేసుల్లో ఇలా జరిగితే విశ్వాసం కోల్పోతామని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవినాష్‌ విచారణను పదే పదే ఎందుకు వాయిదా వేస్తున్నారని స్థానిక అధికారులను ఢిల్లీ సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

  • 22 May 2023 5:25 AM GMT

    కర్నూలులో ఆపరేషన్‌ అవినాష్‌

    కర్నూలులో ఆపరేషన్‌ అవినాష్‌ కొనసాగుతోంది. పోలీస్‌ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు...జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారుల చర్చలు జరుపుతున్నారు.శాంతిభద్రతల నేపథ్యంలో అవినాష్‌ లొంగి పోవాలని చెప్పాలని సీబీఐ అధికారులు కోరినట్లు సమాచారం.అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపధ్యంలో విశ్వభారతి ఆసుపత్రికి అవినాష్‌ అను చరులు భారీగా చేరుకుంటున్నారు. ఈనేపధ్యం లో విశ్వభారతి ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరించారు.

Tags

Read MoreRead Less
Next Story