బీజేపీతో జేడీఎస్ మళ్లీ దోస్తీ..!

బీజేపీతో జేడీఎస్ మళ్లీ దోస్తీ..!
బీజేపీతో జేడీఎస్ మళ్లీ దోస్తీ కడుతోందా? కమలం పార్టీకి కుమారస్వామి దగ్గరవుతున్నారా? కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసినా జేడీఎస్.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో జత కట్టాలని భావిస్తున్నారా?

బీజేపీతో జేడీఎస్ మళ్లీ దోస్తీ కడుతోందా? కమలం పార్టీకి కుమారస్వామి దగ్గరవుతున్నారా? కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసినా జేడీఎస్.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో జత కట్టాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి కర్నాటక నుంచి ఢిల్లీ వరకు పొలిటికల్ పరిణామాలు. 2024 జాతీయ ఎన్నికలలో బీజేపీ పొత్తు కోసం ఇప్పటికే.. కాషాయ పార్టీ నేతలతో చర్చినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే గెలుచుకున్న JDS.. అసెంబ్లీ ఎన్నికల తీర్పు వెలువడిన వారాల వ్యవధిలోనే బీజేపీతో పొత్తుకు సిద్ధమని చెప్పినట్లు సమాచారం. బీజేపీ వైపు జేడీఎస్ మొగ్గుచూపుతున్నట్లు వస్తున్న ప్రచారం హాట్‌టాపిక్‌గా మారగా.. హస్తినలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ఇటీవల కర్నాటక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించి.. కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌ అవ్వాలనుకున్న జేడీఎస్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. JDS 224 సీట్లలో కేవలం 19 మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి.. ఒకప్పటి మిత్రపక్షమైన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌ను ఓడించి తన ఓట్‌బేస్‌ను కాపాడుకోవని అంచనా వేస్తున్నట్లు సమాచారం.

ఇక ఇవాళ బెంగళూరులో బీజేపీ కీలక సమావేశం కానుంది. కర్నాటక ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశానికి ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు సైతం హాజరుకానున్నారు. ఎన్నికలు జరిగి చాలా రోజులైనా ఇప్పటివరకు బీజేపీఎల్పీ నేతను ఎన్నుకోలేదు. దీంతో ఇవాళ జరిగే సమావేశంలో బీజేపీ శాసనసభాపక్షనేతను ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే బీజేఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారు అనేది సస్పెన్స్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story